వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలియని వారంటు ఉండరు.ఈమె టాలివుడ్ లో నటించిన మొదటి సినిమా మంచి హిట్ అయ్యింది ఆ తర్వాత తెలుగు,తమిళ్,కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఇటు సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండ నార్త్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.అయితే గత కొంతకాలంగా ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీలో సినిమాలను తగ్గించి తన దృష్టి నార్త్ వైపు మళ్ళించి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
ఇలా సౌత్, నార్త్ సినిమాలతో బిజీగా ఉండే రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో పాటు వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల రకుల్ ప్రీత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా రకుల్ ప్రీత్ అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ క్రమంలో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ..
నటిని కావాలనే సంకల్పంతో ఢిల్లీ నుండి ముంబై వచ్చాను.ఆరోజు నా ఆత్మవిశ్వాసమే నా ఆయుధం.
ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను.ఇప్పుడు కూడా అంతే ఆత్మ విశ్వాసంతో ఉన్నాను అంటు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఒక వ్యక్తిగా నేను చాలా బలంగా, సురక్షితంగా ఉన్నా.నటిగా ఇంకా మంచి అవకాశాలు అందుకొని ఇంకా ఎదగాలని కష్టపడుతున్నా.ఎన్ని సినిమాలలో నటించానని కాదు ఎంత గొప్ప పాత్రలలో నటించామనేది ముఖ్యం.ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు అందులోని పాత్రలపట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నా.ఇప్పటిదాకా నా వరకు వచ్చిన సినిమాలన్నీటికి నేను కృతజ్ఞరాలిని.అలాగే నేను నటించే సినిమాల్లో ఎంతమంది హీరో హీరోయిన్లు ఉన్నా నాకు అభ్యంతరం లేదు.
ఎందుకంటే ఎవరి పాత్ర వారిది.సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.