పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని తెలుగు రాష్ట్రాలలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.అయితే నిజ జీవితంలో పవన్ సీఎం అవుతారో లేదో కచ్చితంగా చెప్పలేం కానీ పవన్ రాబోయే రోజుల్లో ఒక సినిమాలో సీఎంగా కనిపించనున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
పవన్ ను సీఎం పాత్రలో చూపిస్తే అంచనాలు మామూలుగా ఉండవు.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్ ను సీఎం రోల్ లో చూడాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు సీఎం రోల్స్ లో నటించారు.ఈ హీరోలలో కొంతమంది హీరోలు విజయాలను అందుకుంటే మరి కొందరు హీరోలు మాత్రం సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
పవన్ కళ్యాణ్ సీఎం రోల్ లో నటిస్తే చూడాలని ఉందని ఆయన ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.పవన్ ప్రస్తుత ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.