మ్యాన్‌హోల్‌లో పడినా.. ప్రాణాలతో బయటపడ్డ జంట

వర్షాకాలం వచ్చిందంటే రహదారులపైకి వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతారు.వర్షాలతో నిండిన గుంతలు, ఎక్కడుందో తెలియని మ్యాన్ హోల్‌లు ప్రజల ప్రాణాలను బలిగొంటాయి.

 Even If They Fall Into The Manhole The Couple Who Survived , Manhole, Lover, Fa-TeluguStop.com

ఈ భయంతో ఎంత జాగ్రత్తగా వాహనాలను నడిపినా, వర్షాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.వర్షపు నీరు పోనిచ్చేందుకు మ్యాన్ హోల్ మూత తీసి కొన్ని సందర్భాల్లో అక్కడ ఎలాంటి సూచిక బోర్డులు పెట్టరు.

దీంతో పొరపాటుగా అటుగా వచ్చే వాహనదారులు అందులో పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి.తాజాగా ఓ జంటకు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

అయితే ఘటనలో వారు తమ ప్రాణాలను దక్కించుకున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని కిషన్‌పూర్‌లో తాజా ఘటన చోటుచేసుకుంది.ఒక జంట స్కూటీపై ప్రయాణిస్తూ, వరదలతో నిండిన వీధి గుండా వెళ్లింది.ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది.అయితే అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో, స్కూటీపై ఒక జంట ఫుట్ పాత్ పక్కన పార్క్ చేయడానికి వరదలు ఉన్న వీధి గుండా వెళుతుండగా, వాహనంతో పాటు దానిపై ఉన్న దంపతులు మ్యాన్ హోల్‌లో పడిపోయారు.వెంటనే పక్కనే ఉన్న కొందరు ఈ దంపతులకు సాయం చేయడానికి పరుగు పరుగున వచ్చారు.

వారిని సురక్షితంగా పక్కకు తీసుకొచ్చారు.వారి స్కూటీ మాత్రం కనిపించలేదు.

యూపీ పోలీసు అధికారి దయానంద్ సింగ్ అత్రి, అతని భార్య అంజు అత్రిగా ఈ దంపతులును గుర్తించారు.అనారోగ్యం కారణంగా డాక్టర్‌ను కలిసేందుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube