టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సునీతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.సింగర్ సునీత పాడిన పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సునీతకు మంచి గుర్తింపు ఉంది.తెలుగులోని ప్రముఖ హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు.
పలు రియాలిటీ షోలకు సునీత జడ్జిగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే.వివాదాలకు సునీత దూరంగా ఉంటారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సింగర్ సునీత ప్రేక్షకుల కోరిక మేరకు లైవ్ లో పాటలు పాడి వినిపించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.అయితే తాజాగా స్టార్ సింగర్ సునీత ఎమోషనల్ అయ్యారు.
కూతురి పుట్టినరోజు సందర్భంగా కూతురితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సునీత పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ లో సునీత తన కూతురి బర్త్ డే సూపర్ డూపర్ బర్త్ డే అని తన కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పుకొచ్చారు.
ఇంత మంచి కూతురుకు తాను తల్లిని అయినందుకు చాలా గర్వపడుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.
కూతురుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సునీత కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకోగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.కూతురిపై ప్రేమను వ్యక్తం చేస్తూ సునీత చేసిన పోస్ట్ ప్రేక్ష్హకులను ఎంతగానో ఆకట్టుకుంది.సునీతకు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
కొత్త సింగర్లు, ఇతర భాషల సింగర్ల ఎంట్రీతో సునీతకు గతంతో పోల్చి చూస్తే కొంతమేర ఆఫర్లు తగ్గాయి.మరోవైపు సునీత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇతర సింగర్లతో పోల్చి చూస్తే సునీత రెమ్యునరేషన్ కొంతమేర ఎక్కువేనని సమాచారం.సునీత గాత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.