బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ప్రెసెంట్ ఈయన కబీ ఈద్ కబీ దివాలీ సినిమాతో పాటు టైగర్ 3 సినిమాలు చేస్తున్నాడు.
సల్మాన్ నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాలీ అనే సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఆమెకు అన్న పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
దీంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారు.ఇది ఇలా ఉండగా సల్మాన్ ఈ సినిమాలతో పాటు నో ఎంట్రీ సినిమా సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
అంతేకాదు.ఈ సినిమాలో ఏకంగా సల్మాన్ ఖాన్ త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా 10మంది నాయికలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.2005లో నో ఎంట్రీ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు.తన సహచరులు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ లతో కలిసి సల్మాన్ ఖాన్ నటించ నున్నాడు.
నో ఎంట్రీ-మే ఎంట్రీ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్, సల్మాన్ ఖాన్ త్రిపాత్రాభినయం చేయనున్నారట.
అలాగే ఈ సినిమా కోసం 10 మంది హీరోయిన్ లను తీసుకోనున్నారట.ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్న ఇప్పటికి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.అప్పుడు ఈ సినిమాలో బిపాసా, లారా దత్తా, ఈషా డియోల్, సెలీనా జైట్లీ వంటివారు నటించారు.
అప్పటి టీమ్ ను తేవడానికి ప్రయత్నాలు చేస్తున్న 2005లో వచ్చింది కాబట్టి అంత సులువు కాదు.అందుకే మేకర్స్ 10 మంది హీరోయిన్ ల కోసం వేట సాగిస్తున్నారు.
మరి ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.