స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం సాయి పల్లవి రానా కలిసి నటించిన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు తెలుగు, తమిళ భాషలలో విడుదల అయ్యింది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరిగాయి.సినిమా ప్రమోషన్స్ కోసం సినిమా యూనిట్ తో పాటు సాయిపల్లవి కూడా తన వంతు కృషి చేసింది.
పలు టీవీ ఛానల్ లు, యూట్యూబ్ ఛానల్ లు నిర్వహించిన ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి రిలీజియస్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన సాయి పల్లవి ఉదాహరణగా కాశ్మీరి ఫైల్స్ ని తీసుకుంది.
కాశ్మీరీ ఫైల్స్ లో కాశ్మీరీ పండిట్ లను కొట్టి చంపారు.అదేవిధంగా ఇటీవల కొందరూ వ్యక్తులు గోవును కొట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చెప్పారు.
కాశ్మీరీ ఫైల్స్ లో జరిగినదానికి, ఇక్కడ జరిగినదానికి పెద్ద తేడా లేదు.ఇలా గోవులను అక్రమ రవాణా చేసే వారితో కాశ్మీరీ పండిట్ లను పోల్చడం తో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సాయి పల్లవిని కొందరు వ్యక్తులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.అంతే కాకుండా ఆమె మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.ఎట్టకేలకు సాయి పల్లవి ఈ వివాదం గురించి స్పందించింది.తాజాగా గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో సాయి పల్లవి మాట్లాడుతూ.నేను చేసిన వ్యాఖ్యలపై ఆన్సర్ చెబుతాను.కానీ ఇప్పుడు కాదు.
ప్రస్తుతం నేను ఏం మాట్లాడినా కూడా సినిమా ప్రమోషన్ కోసం చేశానని, అనుకుంటారు.ఇప్పుడు నేను విరాట పర్వం సినిమా విడుదలవుతుండటంతో ఆ ఆనందంలో ఉన్నాను.
ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ వివాదం గురించి మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చింది.