ప్రపంచంలోనే అతి పురాతనమైన థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?

ప్రస్తుత కాలంలో మల్టీప్లెక్స్ థియేటర్లు రావడం వల్ల సింగిల్ థియేటర్లకు కూడా పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది.ఈ క్రమంలోనే సుమారు పది పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించిన ఎన్నో థియేటర్లకు ఆదరణ లేకపోవడంతో థియేటర్లను షాపింగ్ మాల్స్, గోడౌన్స్, ఫంక్షన్ హాల్ గా మార్చేస్తున్నారు.

 Eden Theater Of France Oldest Movie Theater In The World Details, Old Theater, W-TeluguStop.com

ఈ విధంగా 10 సంవత్సరాల క్రితం కట్టిన థియేటర్లకు కూడా పెద్దగా ఆదరణ లేకపోతున్న ఈ రోజుల్లో సుమారు 123 ఏళ్ల కిందట కట్టిన థియేటర్ లో ఇప్పటికీ పలు సినిమాలు ప్రదర్శితం అవుతూ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ విధంగా థియేటర్ ప్రపంచంలోని అతి పురాతనమైన థియేటర్ గా పేరు పొందింది.

ఈ అత్యంత పురాతనమైన థియేటర్ ఫ్రాన్స్‌లోని లా సియోటట్‌లో ఉంది.థియేటర్ పేరు ఈడన్‌ థియేటర్‌.1899లోప్రారంభమైన ఈ థియేటర్ మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలను ప్రదర్శించలేదు.అయితే ప్రస్తుతం థియేటర్ కొన్ని హంగులను ఏర్పాటు చేసుకుని తిరిగి యధావిధిగా థియేటర్ లో సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి.

థియేటర్ లో మొట్టమొదటిసారిగా లుమైరి బ్రదర్స్‌ తీసిన కదులుతున్న ట్రైన్‌ను ప్రదర్శించారు.

కేవలం నిమిషాల వ్యవధి ఉన్నటువంటి అతి చిన్న సినిమాతో థియేటర్స్ ప్రారంభమైంది.

Telugu Eden Theater, Edentheater, France, Theater, Oldest Theater, Oldesttheater

కేవలం ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగడం మాత్రమే చూపించారు.అప్పట్లో సినిమా థియేటర్లో చూడడంతో ప్రజలు ఎంతో సంతోషంతో కేరింతలు కొట్టారు.థియేటర్ ప్రారంభమైనప్పడు ఈ థియేటర్ లో 250 మంది మొదటి ప్రదర్శన చూసి సంతోష పడ్డారు.ఇకపోతే 1980 వరకు ఎంతో అద్భుతంగా ముందుకు నడిచిన ఈ థియేటర్ అనంతరం కష్టాలను ఎదుర్కొంది.

అయితే ఫ్రాన్స్ ప్రజలు ఈ థియేటర్ ను థియేటర్ లా కాకుండా ఒక చారిత్రక కట్టడంగా భావించారు కనుక ఫ్రాన్స్ ప్రజల డిమాండ్ తో దిగివచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ నిధులతో థియేటర్ ను అందంగా తీర్చిదిద్ది ప్రస్తుతం ఇందులో సినిమాలను ప్రదర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube