వారానికి 4 రోజులే వర్క్.. కంపెనీలు వినూత్న ప్రయోగం

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్లో వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది.శని, ఆదివారాల్లో సెలవు ఉంటుంది.

 Uk Headed For Four Days Work Week In Sixty Companies Details, Four Days,work 3 D-TeluguStop.com

ఇక మంత్లీ, సిక్ లివ్స్, పబ్లిక్ హాలిడేస్ అని చాలానే సెలవులు ఉంటాయి.తక్కువ పని చేసినా ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండాలనేది కంపెనీల సిద్ధాంతం.

ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా సులువుగా పనిచేసుకుంటేనే పనిలో నాణ్యత ఎక్కువ ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.అందుకే ఉద్యోగులకు శాలరీ ఇంక్రిమెంట్లతో పాటు అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.

తాజాగా కంపెనీలు ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి.వారానికి కేవలం 4 రోజుల పని, 3 రోజులు సెలవులు ఇచ్చేలా వినూత్న ఆలోచనను తెరపైకి తెచ్చాయి.బ్రిటన్ లోని కంపెనీలు ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవులు ఇచ్చే విధానాన్ని తాజాగా అమల్లోకి కూడా తెచ్చాయి.బ్రిటన్ లోని 60 కంపెనీల్లో ఈ విధానం ప్రస్తుతం అమలవుతోంది.

ఉద్యోగుల జాతాల్లో ఎలాంటి కోత విధించడం లేదని, వారానికి 4 రోజులు పనిచేసినా ఫుల్ శాలరీ ఇస్తున్నామని స్పష్టం చేస్తున్నాయి.

ఇక స్పెయిన్, ఐస్ లాండ్, అమెరికా, కెనడాలోని కొన్ని కంపెనీలు కూడా నాలుగు రోజుల పని కాన్సెప్ట్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి.

Telugu America, Australia, Canada, Company, Employees Days, Days, Holidays, Key,

అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోని అక్కడ కంపెనీలు కూడా ఈ విధానాన్ని ఆగస్టు నుంచి అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.వారానికి 3 రోజులు సెలవులు ఇవ్వడం ద్వారా మిగతా నాలుగు రోజులు ఉద్యోగులు మెరుగ్గా పనిచేస్తున్నారని, ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి.వారంలో పనిచేసే పనిని ఈ నాలుగు రోజుల్లో పనిచేసి మిగతా 3 రోజులు విశ్రాంతి తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాయి.

Telugu America, Australia, Canada, Company, Employees Days, Days, Holidays, Key,

అయితే ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ వల్ల ఉపయోగం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.విదేశాల్లోని ఉద్యోగులు సెలవు రోజుల్లో బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తారని, దీని వల్ల నగదు ప్రవాహం పెరిగి దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అంటున్నారు.అయితే ఇండియాలోని ఉద్యోగులు సెలవు రోజుల్లో కూడా ఇంట్లోని ఉండి టీవీల్లో సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని, బయటికి వెళ్లేది తక్కువమంది అని చెబుతున్నారు.

దీని వల్ల ఉపయోగం ఉండదని అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube