ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తమ భాగస్వామితో విడిపోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతుండటం అభిమానులను సైతం ఎంతగానో బాధ పెడుతోంది.
సెలబ్రిటీలు విడిపోవటానికి కూడా చిన్నచిన్న కారణాలే ఉండటం గమనార్హం.బేధాభిప్రాయాలు రావడం వల్లే సెలబ్రిటీలలో చాలామంది విడిపోతున్నారని సమాచారం అందుతోంది.
అయితే విడిపోయిన సెలబ్రిటీలు తమ భాగస్వామిపై సంచలన ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. భోజ్ పురిలోని పాపులర్ నటులలో ఒకరైన పవన్ సింగ్ తాజాగా తన రెండో భార్య గురించి సంచలన ఆరోపణలు చేశారు.
తన రెండో భార్యతో కలిసి జీవించడం కష్టమని పవన్ సింగ్ వెల్లడించారు.పవన్ సింగ్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఆయనకు పాపులారిటీ దక్కింది.
పవన్ సింగ్ మొదటి భార్య పేరు నీలం సింగ్ కాగా ముంబైలోని ఫ్లాట్ లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.2015 సంవత్సరం మార్చి నెల 8వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ తర్వాత పవన్ సింగ్ జ్యోతి సింగ్ అనే యువతిని వివాహం చేసుకున్నారు.కొన్నిరోజుల క్రితం విడాకుల కోసం పవన్ సింగ్ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు విడాకులు కావాలని చెప్పుకొచ్చారు.

పవన్ సింగ్ కామెంట్ల గురించి జ్యోతి సింగ్, ఆమె తరపు న్యాయవాది స్పందిస్తూ పవన్ సింగ్ జ్యోతికి ఇష్టం లేకపోయినా రెండుసార్లు అబార్షన్ చేయించారని పెళ్లైన రోజు నుంచి ప్రతిరోజూ వేధింపులకు గురి చేసేవాడని ఆయన వెల్లడించారు.భర్త ఆగడాలను భరించలేక ప్రస్తుతం జ్యోతి సింగ్ ప్రస్తుతం పుట్టింట్లో ఉన్నారని ఆయన తెలిపారు.విడాకులు ఇస్తే ఆమెకు భర్త నుంచి భరణం ఇప్పించాలని భర్త తరపు న్యాయవాది కోరారు.