కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 714 జీవోను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ఆఫీస్ ను ముట్టడించి నిరసన తెలిపి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వర ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది .కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 714 జీవోను రద్దు చేయాలని జేఏసీ రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునివ్వడం జరిగింది .
ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో స్వచ్ఛందంగా బందులో ఆటో డ్రైవర్లు , క్యాబ్ డ్రైవర్లు , లారీ డ్రైవర్స్ , స్వచ్ఛందంగా బందులో పాల్గొని విజయవంతం చేశారు .ఆర్ టి ఓ ఆఫీస్ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 714 జీవో వలన మోటారు రంగ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఫిట్నెస్ ఛార్జీలు రోజుకు 50/- రూపాయలు పెనాల్టీ పేరుతో తో వేల రూపాయల అపరాధ రుసుము కట్టవలసి వస్తుంది కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం 714 జీవో రద్దు చేయాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని జేఏసీ నాయకులు హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్కెవి జిల్లా నాయకులు పాల్వంచ కృష్ణ , ఎం.డీ.వై పాషా , సీఐటీయూ నాయకులు కల్యాణ వెంకటేశ్వర్లు , తుమ్మ విష్ణు , మధు , జల్లా ఉపేందర్ , ఏఐటీయూసీ నాయకులు పేర బోయిన మోహన్ రావు , రావుల శ్రీను , ఐఎఫ్టీయూ నాయకులు లక్ష్మీనారాయణ , క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు పెరుగు బిక్షం , ఆటో యూనియన్ నాయకులు వేమల సెల్వరాజ్ , జానీ , నగేష్ , దుర్గా ప్రసాద్ , వెంపటి రమేష్ , సురేష్ మరియు వివిధ అడ్డా ప్రెసిడెంట్స్ , కమిటీ సభ్యులు , ఆటో కార్మికులు పాల్గొన్నారు .