డా. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ ...ఇక పశువులకు కూడా అంబులెన్స్‌ సేవలు

డా.వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ.ఇక పశువులకు కూడా అంబులెన్స్‌ సేవలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు మొదటి దశలో రూ.143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్‌లను సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద నేడు జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌రెండో దశలో రూ.135 కోట్ల వ్యయంతో త్వరలో మిగిలిన 165 పశువుల అంబులెన్స్‌లు కొనుగోలు మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

 Dr Ysr Nomadic Animal Health Service  Ambulance Services For Cattle As Well ,-TeluguStop.com

ప్రతి పశువుల అంబులెన్స్‌లో.ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం ఉండేలా ఏర్పాటుప్రాధమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాల రూపకల్పన అవసరమైతే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్సను చేసే సౌలభ్యం అవసరమైన పరిస్ధితులలో దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలిక్లీనిక్‌లకు తరలించి పశువుకు సరైన వైద్యం అందించి ప్రాణాపాయం నుండి రక్షించడం జరుగుతుంది వైద్యం అందించిన పిమ్మట మరలా ఆ పశువు రైతు ఇంటికి ఉచితంగా చేర్చడం జరుగుతుంది

మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1962 కు ఫోన్‌ చేసి రైతు పేరు, గ్రామం, మండలం, పశువు అనారోగ్య సమస్య వివరించిన వెంటనే సంబంధిత రైతు భరోసా కేంద్రానికి సమాచారం చేరుతుంది.ఆ వెంటనే పశువుల అంబులెన్స్‌లు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్ళి వైద్యసేవలు అందిస్తాయి.108 అంబులెన్స్‌ సేవల తరహాలోనే పశువుల అంబులెన్స్‌ సేవలు దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రెండు ( ప్రస్తుతానికి ఒకటి) చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు వైద్యశాల (పశువుల అంబులెన్స్‌) వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో సైతం రైతులకు ఖచ్చితమైన, నాణ్యమైన పశు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ అంబులెన్స్‌ల మెయిన్‌టెనెన్స్‌ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తూ నాణ్యమైన సేవలు అందించనుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube