తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో కంటెస్టెంట్ లు బిందుమాధవి, అఖిల్ మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే వస్తున్నాయి.
అయితే వీరి గొడవలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వీరిద్దరూ మండి పడుతూ ఉంటారు.
ఇక వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో కలిసి ఉన్న రోజులలో చెప్పమంటే వేళ్ల లో లెక్కపెట్టవచ్చు.ఇక అఖిల్ ను బిందుమాధవి ఆడ అంటూ డబుల్ మీనింగ్ మాటలతో మరింత బాధ పెట్టిన విషయం తెలిసిందే.
అఖిల్ వాడే స్లాంగ్ ఆడ అనే పదాన్ని తప్పుగా మార్చేసింది బిందుమాధవి.ఆడ అనే పదాన్ని జెండర్ విషయంలో అఖిల్ మీద బిందుమాధవి ప్రయోగించి అనంతరం అందులో జెండా లేదు అని బిందు మాధవి తప్పుదారి పట్టించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున బిందుమాధవి కి సంబంధించి ఒక విషయాన్ని లేవనెత్తారు.తాజాగా జరిగిన 11వ వారం నామినేషన్స్ లో భాగంగా నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి ల వాగ్వాదం మితిమీరింది.

ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టారు ఆడపిల్ల అని బిందు మాధవిని అనగా, అప్పుడు బిందుమాధవి ఆడ అనే పదాన్ని తీసుకుని అఖిల్ ను మళ్ళీ ప్రస్తావించింది.దీనితో నాగార్జున ఆ వీడియోని ప్లే చేయించి బిందు మాధవిని ఇరికించేశాడు.గతంలో ఆడ అనేది స్లాంగ్ అని జెండర్ కాదు అని అన్నావు ఇక్కడేమో ఆడ అంటే అమ్మాయి అని చెబుతున్నావు ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటూ ప్రశ్నించడంతో బిందు మాధవి బిక్కమొహం వేసింది.అయితే బిందు మాధవి , హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడింది.