టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ చైతన్య విడాకుల అంశం అందరిని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలిసి టాలీవుడ్ లో అభిమానులతో పాటు మిగతా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
అసలు వీరిద్దరూ విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు అందుకే ఈ విడాకులు విషయాన్నీ అభిమానులు ఇప్పటికి జీర్ణించు కోలేక పోతున్నారు.
ఇక విడాకుల తర్వాత అటు సమంత, ఇటు నాగ చైతన్య ఇద్దరు కూడా తమ కెరీర్ లపైనే ద్రుష్టి పెట్టారు.
కానీ వీరి విడాకుల విషయంలో మీడియా మాత్రం కొద్దిగా ఎక్కువుగానే ఇన్వాల్వ్ అయ్యారు.వారిద్దరూ తమ పర్సనల్ స్పేస్ ఇవ్వాలని మీడియా వేదికగా తెలిపిన వారిపై ట్రోల్స్ మాత్రం ఆగలేదు.
ఆ ట్రోల్స్ కు సమంత కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది.సమంత చైతూతో విడిపోయిన తర్వాత తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.
అయితే వీరిద్దరూ విడిపోయి నెలలు అవుతున్న ఏదో ఒక వార్త వీరి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
సమంత కూడా చాలా సార్లు ఇన్ డైరెక్ట్ గా పోస్టులు పెడుతూ ఏదొక సందేహం కలిగేలా చేస్తూ వస్తుంది.2017లో పెళ్లి చేసుకుని నాలుగేళ్ళ కాపురం తర్వాత వీరిద్దరూ విడిపోయి టాలీవుడ్ లో అందరికి షాక్ ఇచ్చారు.ఈ విషయం ఇప్పుడిప్పుడే మర్చిపోయారు అని అనుకుంటున్న సమయంలో మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
నాగార్జున తాజాగా సమంత తండ్రితో భేటీ అయ్యారని వార్త నెట్టింట నిన్నటి నుండి వైరల్ అవుతూనే ఉంది.కారణం ఏమిటో తెలియదు కానీ ముందే సమంత చైతూ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట.కానీ ఈమె వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది.తాజాగా వీరిద్దరూ భేటీ అయ్యి గంటకు పైగానే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది.మరి ఈ భేటీ వెనుక కారణం ఏంటా అని అందరు ఆలోచిస్తున్నారు.భవిష్యత్తులో భరణం, ఇతర విషయాలపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఇలా భేటీ అయ్యారని టాక్ నడుస్తుంది.
చూడాలి మరి ముందు ముందు అయినా దీని గురించి బయటకు వస్తుందో లేదో.