మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమా నాన్ రాజమౌళి రికార్డును దక్కించుకుంటుందనే నమ్మకంను మహేష్ బాబు అభిమానులు బలంగా వ్యక్తం చేశారు.ముఖ్యంగా నైజాం ఏరియాలోని భీమ్లా నాయక్ రికార్డును బ్రేక్ చేస్తుందని అంతా భావించారు.
కాని సినిమా విడుదల అయిన మొదటి రోజే వసూళ్ల విషయంలో నిరాశ తప్పలేదు.సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా థియేటర్ల వద్ద సందడి కనిపించలేదు.
పైగా భీమ్లా నాయన్ సినిమా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయలేదు అనే టాక్ ఉంది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను సర్కారు వారి పాట నమోదు చేస్తుందేమో అంటూ ప్రతి ఒక్కరు బలంగా అనుకున్నా కూడా వారికి నిరాశ తప్పలేదు.
భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి.కాని సర్కారు వారి పాట సినిమాకు నెగటివ్ టాక్ ను కొందరు ప్రచారం చేశారు.
మీడియాలో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో మాత్రం సర్కారు వారి పాట సినిమా ప్లాప్ అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమా విడుదల తర్వాత వచ్చిన ఫలితం కారణం మొత్తం రివర్స్ అయ్యింది.
భీమ్లా నాయక్ రికార్డు ను ఆచార్య బ్రేక్ చేస్తుందని భావిస్తే అది నిరాశ పర్చింది.ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా నిరాశ పర్చడంతో పవన్ అభిమానులు ఒకింత అనందంలో ఉన్నారు.
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించింది.సముద్రకని కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా లో మహేష్ బాబు పాత్ర కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
హీరోయిజం కంటే మాస్ ఎలిమెంట్స్ విషయంలో మహేష్ ఎక్కువ దృష్టి పెట్టాడని అంటున్నారు.