ఎన్నో రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందిస్తూ.దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు ఏ స్టేట్ మెంట్ ఇచ్చినా, అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
తాజాగా బిజెపి వ్యవహారంపై ఆయన స్పందించారు.బిజెపిలో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ అని చెప్పిన ఆయన మరెన్నో సంచలన విషయాలపై మాట్లాడారు.
జాతీయ మీడియాతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిజెపి కి ఉన్న బలం దాని సంస్థాగత వ్యవస్థ అని, ప్రధాని నరేంద్ర మోదీ మీద ఎక్కువగా ఆధారపడటం ఆ పార్టీ బలహీనత అంటూ ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు సరైన విధానంలో వెళ్తే రాబోయే రెండేళ్లలో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.ఒకవేళ అది గనుక జరగకపోతే రాబోయే దశాబ్దాల పాటు బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి ఏదీ ఉండదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.
బీజేపీకి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీతోనే ముప్పు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు రాజకీయంగానూ ఆసక్తికరంగా మారాయి.అయితే కాంగ్రెస్ పార్టీకి వారసత్వం అనే అంశం బలం అయితే… జడత్వం దాని బలహీనత అంటూ ఆయన పేర్కొన్నారు.

ఏ పార్టీ అయినా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాలుగు లు అవసరమని, ప్రశాంత్ కిషోర్ చెప్పారు.వాటిలో లైట్ మెసేజ్, ట్రస్టెడ్ మెసెంజర్, పార్టీ మెషినరీ , మెకానిక్ ఆఫ్ ది క్యాంపెయిన్ ముఖ్యమని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన ప్రతిపక్షం గా కాంగ్రెస్ ఉన్నప్పటికీ, తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ నాయకులంతా సమిష్టిగా కృషి చేస్తే బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
బిజెపికి ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవుతుంది తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ కాదని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు.