కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఈ వీడియోనే ఉదాహరణ.అన్ని వున్న మనం ఏమి చేతకాని వానిలా సమయాన్ని వృధా చేస్తుంటే, కాలు లేని ఆమె మొక్కవోని దీక్షతో కళ్ళు వున్న వాళ్లతో తలపడి ఔరా అనిపించుకుంది.
సోషల్ మీడియాలో ఇటివంటి వీడియోలకు మంచి గిరాకీ ఉంటుంది.అదేనండి.
మంచి వ్యూస్ వస్తాయి.తద్వారా వైరల్ వుంటాయి.
ఇప్పుడు కూడా ఓ రేసు పోటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన తర్వాత, ఎలాంటివాడైనా తనని ప్రశంసించకుండా ఉండలేరు.
అవును.ఈ వీడియో విషయానికొస్తే.ఒక చిన్నారి పరుగుల పోటీలో పాల్గొంది.అందులో తన ప్రత్యర్థుల నడుమ ఓ ఊతకర్ర (క్రచెస్) సహాయంతో రేసులో ఆమె పరుగెత్తింది.
సదరు వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ‘ఓడిపోయినా, నువ్వు ప్రతి ఒక్కరి మనసులను గెలిచావు బిడ్డా!’ అంటూ కామెంట్ చేశారు.కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆ చిన్నారి ఆత్మస్థైర్యానికి సలాం చేయక మానరు.
ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు.కానీ, ఈ వీడియో ఇంటర్నెట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది.
ఈ వీడియో పరుగుల పోటీ సందర్భంగా చిత్రీకరించబడింది.
అక్కడ రేస్ టు రేస్ ట్రాక్లో బాలికలు పరుగెత్తడానికి సిద్ధంగా వున్నారు.ఆ వరుసలో ఆ బాలిక ఒక కాలుతో ఊతకర్ర సాయంతో నిలబడి ఉంది.పరుగెత్తడానికి విజిల్ వేయగానే, ఆ పిల్లలతోపాటు పోటీగా ఈ అమ్మాయి పరుగెత్తింది.
ఒకకాలు మరో ఊతకర్ర సాయంతో పరుగెత్తే ఈ బాలిక పట్టు వదలకుండా ఫినిషింగ్ లైన్ ని తాకే వరకు పరుగెత్తుతూ ఉండడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.ఈ వీడియోను జార్ఖండ్లోని రాంచీ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్ @dc_sanjay_jas నుండి షేర్ చేశారు.