పాకిస్థాన్ ఆటగాడితో కలిసి ఆడిన పూజారా... పాకిస్థాన్ - హిందుస్థాన్ భాయ్, భాయ్?

భారత క్రికెటర్ చ‌తేశ్వ‌ర్ పూజారా గురించి పరిచయం అక్కర్లేదు.అవును.

 Netizens Hail Pujara-rizwan's 'dream Partnership' For Sussex, Sussex,cheteshwar-TeluguStop.com

బేసిగ్గా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ అయినటువంటి ఇతగాడు తన ఆటతీరుతో ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి వచ్చిన అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నాడు.అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు.

ఇక తను వేసిన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలింగ్ స్టైల్ తో ప్రత్యర్ధులు ఒకింత కన్ఫ్యూజన్ కి గురై పెవిలియన్ బాట పట్టేవారు.ప్రస్తుత యువతకి ఈ గుజరాత్ కింగ్ అంటే చెప్పలేని మోజు.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఓ గమ్మత్తైన ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.పూజారా ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్న సంగతి తెలిసిందే.ఇపుడు స‌సెక్స్ త‌ర‌పున ఆడుతున్న ఇతడు దుమ్ముదులిపే బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.డ‌ర్హ‌మ్‌తో జ‌రుగుతున్న డివిజ‌న్ లీగ్‌లో అత‌ను సెంచ‌రీ చేసి ప్రభంజనం సృష్టించాడు.

దీంతో అత‌ని ఖాతాలో 3 సెంచ‌రీలు నమోదు అయ్యాయి.ఇక డ‌ర్హ‌మ్‌తో ఆడిన మ్యాచ్‌లో 2వ రోజు ఓ అరుదైన ఘ‌ట‌న చోటుచేసుకుంది.

పాకిస్థాన్ వికెట్‌కీప‌ర్ అయినటువంటి బ్యాట‌ర్ మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌తో క‌లిసి పూజారా ఆడటం ఆసక్తికరంగా మారింది.

Telugu Cricket Ups, Dream Nership, England County, Mohammad Rizwan, Sussex-Lates

ఇకపోతే, ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన 6వ వికెట్ భాగ్య‌స్వామ్యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పూజారా, రిజ్వాన్‌ల మ‌ధ్య డ్రీమ్ పార్ట్‌న‌ర్‌షిప్‌ ఏర్ప‌డిన‌ట్లు కౌంటీ చాంపియ‌న్‌షిప్ త‌న ట్వీట్‌లో తెలపడంతో ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.2వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి పూజారా 128, రిజ్వాన్ 5 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.దాంతో ఆ ఇద్ద‌రి ఆటగాళ్ల ఫోటోలపైన ఆన్‌లైన్‌లో కామెంట్ల వ‌ర్షం కూడా కురుస్తోంది.ఇప్ప‌టికే డెర్బిషైర్‌, వార్‌షెస్ట‌ర్‌షైర్‌తో జ‌రిగిన మ్యాచుల్లోనూ పూజారా సెంచ‌రీల‌తో ఆకట్టుకున్న విషయం తెలిసినదే.

దీన్ని చూసిన నెటిజన్లు పాకిస్థాన్ – హిందుస్థాన్ భాయి, భాయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube