ఆచార్యలో సిద్ధ పాత్రను వదులుకున్న టాలీవుడ్ స్టార్ ఇతనే.. ఆమె వల్లే తీసేశారంటూ?

ఆచార్య సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ సినిమాలో కాజల్ పాత్రను తీసేశామని ఆచార్య మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

 Interesting Facts About Acharya Movie Siddha Role Details, Acharya Movie, Siddha-TeluguStop.com

ఆచార్య సినిమాలో సిద్ధ రోల్ లో రామ్ చరణ్ నటించడంతో ఈ సినిమా మెగా మల్టీస్టారర్ గా మారింది.అయితే ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రకు మొదట ఎంపికైన హీరో మాత్రం మహేష్ బాబు కావడం గమనార్హం.

కొరటాల శివ ఈ పాత్ర గురించి మహేష్ బాబుకు వివరించగా మహేష్ బాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే చిరంజీవి భార్య సురేఖ కోరిక మేరకు ఆచార్య సినిమాలో మహేష్ బాబుకు బదులుగా రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

మహేష్ బాబు సైతం చరణ్ ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సున్నితంగా ఆచార్య సినిమా నుంచి తప్పుకున్నారు.

ఈ విధంగా ఆచార్య సినిమా సిద్ధ పాత్ర విషయంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

Telugu Acharya, Koratala Shiva, Mahesh Babu, Multirer, Chiranjeevi, Sarkaruvaari

ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమాలో నటించి ఉన్నా ఈ సినిమాపై ఇదే స్థాయిలో అంచనాలు పెరిగేవని చెప్పవచ్చు.మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు.ఆచార్య విడుదలైన రెండు వారాల తర్వాత సర్కారు వారి పాట థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Telugu Acharya, Koratala Shiva, Mahesh Babu, Multirer, Chiranjeevi, Sarkaruvaari

ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు కూడా విజయాలు సాధించి టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.డబ్బింగ్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఆచార్య సినిమాను హిందీలో విడుదల చేయడం లేదని చరణ్ క్లారిటీ ఇచ్చారు.రాబోయే రోజుల్లో ఆచార్య హిందీలో కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉందని చరణ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube