డౌనర్స్ గ్రోవ్:చికాగో: ఏప్రిల్ 24: అమెరికా పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ఎన్.ఆర్.ఐలతో భేటీ అయ్యారు.చికాగోలోని డౌనర్స్ గ్రోవ్ లో ఈ భేటి జరిగింది.
డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్ సామల హేమ, టీటీసీసీసీ అధ్యక్షురాలు శోభనారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.నాట్స్ నాయకులు, ఎంటర్ ప్రెన్యూర్ శ్రీనివాస్ పిడికిటి సమన్వయంతో ఈ భేటి ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ముఖ్యంగా హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎలా ఎదుగుతుంది? మల్టినేషనల్ కంపెనీలకు ఎలా వేదికగా మారుతుందనే అంశంపై డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి వివరించారు.ఎన్.ఆర్.ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్నారై నాయకులు, పారిశ్రామికవేత్తలు మహేష్ కాకర్ల, మదన్ పాములపాటి, శ్రీని యార్లగడ్డ, శ్రీనివాస్ బొప్పన, శ్రీని అరసడ, రవి శ్రీకాకుళం, కె.పి., విజయ్ వెనిగళ్ల, లక్ష్మి బొజ్జ, బిందు బాలినేని, అను, అనిత, రాధ, సుమతి, సుధ, డాక్టర్ నీలిమ, శోభ, దేవి, రాజేష్ వీదులమూడి, కృష్ణ నున్న, కృష్ణ నిమ్మగడ్డ, మనోహర్ పాములపాటి, ఆర్కే, హరీష్ జమ్ముల తదితరులు పాల్గొన్నారు.చికాగోలో ప్రజా రవాణా, కోవిడ్ పరీక్షా కేంద్రాలు, పార్కుల నిర్వహణ, పారిశుధ్యం, డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ కార్యకలాపాలు ముఖ్యంగా ఫ్లాష్ వరద నీటి నియంత్రణ ప్రక్రియ పరిశీలించడానికి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, స్థానిక తెలుగు కమ్యూనిటీ నాయకులతో కలిసి నాపర్విల్లే, షాంబర్గ్ నగర ప్రాంతాలను సందర్శించారు.