వాళ్లు ఎదగడానికే నేను తగ్గుతున్నాను.. ఆ విషయంలో నేను కింగ్ అంటున్న మెగాస్టార్!

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయన కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

 Chiranjeevi Sensational Comments Goes Viral In Social Media , Chiranjeevi , Toll-TeluguStop.com

ఈ క్రమంలోనే రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ఈ నెల 29 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 23వ తేదీ ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన పేరు శివశంకర వరప్రసాద్ అనే విషయాన్ని గుర్తు చేశారు.

శివశంకర వరప్రసాద్ అంటే శివుడి నృత్యానికి కారణం.ఆ శివుడి ముందు ఎవరు డాన్స్ చేయలేరు.

Telugu Acharya, Chiranjeevi, Shivatandavam, Tollywood-Movie

చాలామంది డాన్స్ చేస్తుంటాము అని భావిస్తారు అయితే శివతాండవం తరువాతే ఎవరైనా.అంటూ డాన్స్ విషయంలో తనకు తానే కింగ్ తనకు ఎవరూ సాటి లేరని పరోక్షంగా మెగాస్టార్ తెలియజేశారు.అప్పుడప్పుడు ఇతర హీరోలు కూడా ఎదగాలని తాను తగ్గుతున్నానని, తాను తగ్గడం వల్లే వాళ్ళు ఎదుగుతున్నారని ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు.ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈయన నటించిన ఆచార్య సినిమా పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube