సమంత నాగచైతన్య విడిపోయి ఆరు నెలలైనా వీళ్లిద్దరూ విడిపోవటానికి గల కారణం వెలుగులోకి రాలేదు.అటు అక్కినేని కాంపౌండ్ కానీ ఇటు సమంత కానీ విడిపోవటానికి గల కారణాల గురించి నోరు విప్పడానికి అస్సలు ఇష్టపడలేదు.
చైసామ్ అభిమానులకు సైతం ఎంతో అన్యోన్యంగా ఉండే చైతన్య సమంత ఎందుకు విడిపోయారో అస్సలు అర్థం కావడం లేదు.నెటిజన్లు మాత్రం చైసామ్ విడిపోయిన విషయంలో ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకుంటున్నారు.
ఈ విషయంలో చైతన్యది తప్పని కొంతమంది భావిస్తుంటే మరి కొందరు మాత్రం సమంతదే తప్పని నిందిస్తున్నారు.అయితే నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.మనం సినిమాలో చైతన్యకు జోడీగా చిన్న పాత్రలో మెరిసిన రాశీఖన్నా వెంకీమామ సినిమాలో కూడా చైతన్యకు జోడీగా నటించారు.
థాంక్యూ సినిమాతో చైతన్య రాశీఖన్నా ఖాతాలో మరో హిట్ చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు.
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ విడిపోతున్నారని గత రెండు రోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ లో “ఏ డై విత్ ఔట్ సన్ షైన్ లైక్.యూ నో.నైట్” అని పేర్కొన్నారు.ఈ పోస్ట్ కు రాశీఖన్నా ఫైర్ ఎమోజీని కామెంట్ గా పెట్టారు.
రాశీఖన్నా అలా చేయడంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి నువ్వే కారణమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరు నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి చైతన్య సమంత విడిపోవడానికి రాశీఖన్నా కారణమని కామెంట్లు చేస్తున్నారు.
రాశీఖన్నా ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.