వాళ్లు ఎదగడానికే నేను తగ్గుతున్నాను.. ఆ విషయంలో నేను కింగ్ అంటున్న మెగాస్టార్!

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయన కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

ఈ క్రమంలోనే రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ఈ నెల 29 వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 23వ తేదీ ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన పేరు శివశంకర వరప్రసాద్ అనే విషయాన్ని గుర్తు చేశారు.

శివశంకర వరప్రసాద్ అంటే శివుడి నృత్యానికి కారణం.ఆ శివుడి ముందు ఎవరు డాన్స్ చేయలేరు.

"""/" / చాలామంది డాన్స్ చేస్తుంటాము అని భావిస్తారు అయితే శివతాండవం తరువాతే ఎవరైనా.

అంటూ డాన్స్ విషయంలో తనకు తానే కింగ్ తనకు ఎవరూ సాటి లేరని పరోక్షంగా మెగాస్టార్ తెలియజేశారు.

అప్పుడప్పుడు ఇతర హీరోలు కూడా ఎదగాలని తాను తగ్గుతున్నానని, తాను తగ్గడం వల్లే వాళ్ళు ఎదుగుతున్నారని ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు.

ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈయన నటించిన ఆచార్య సినిమా పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

ఛీ, ఛీ.. ఆ రెస్టారెంట్‌లో దేనితో నూనె తయారు చేస్తారో తెలిస్తే షాకే..