పదకొండేళ్ళ వయస్సులోనే రణబీర్ ప్రేమలో పడిన అలియా.. లవ్ అట్ ఫస్ట్ సైట్!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా ఇన్ని రోజులు ప్రేమలో విహరించిన రణబీర్ కపూర్, అలియా భట్ మరి కొద్ది రోజులలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Alia Fell In Love With Ranbir At The Age Of Eleven Love At First Sight Alia Bhat-TeluguStop.com

ఇకపోతే ఇన్నిరోజులు ప్రేమపక్షులుగా వార్తల్లో నిలిచిన ఈ జంట వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఆలియా భట్ రణబీర్ కపూర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ప్రేమ గురించి ఎవరైనా మాట్లాడితే ప్రేమకు వయసు అడ్డురాదని అది కేవలం సంఖ్య మాత్రమే అని చెబుతారు.అచ్చం అలియా విషయంలో కూడా వయసుతో సంబంధం లేకుండా పదకొండేళ్ళ వయస్సులోనే రణబీర్ ప్రేమలో పడినట్లు తెలిపారు.

అలియా భట్ పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీబ్లాక్ చిత్రం కొరకు ఆడిషన్స్ జరుపుతున్న రోజుల్లో రణబీర్ కపూర్ అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారు.

Telugu Alia Bhatt, Bollywood, Coffe Karan, Eleven, Karan Johar, Love, Ranbir, Sa

ఇక ఈ సినిమా కోసం ఆడిషన్స్ కి వెళ్ళిన ఆలియా ఆ సమయంలో రణబీర్ కపూర్ ని చూసి మనసు పారేసుకున్నారట.ఇలా రణబీర్ ని చూడగానే తన మనసులో ప్రేమ పుట్టిందని తెలిపారు.ఇక అలియా బట్ హీరోయిన్ గా మారిన తర్వాత కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న అలియాభట్ తనకు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపారు.

అయితే అప్పటికి ఇంకా తనపై ప్రేమ కలగలేదని అలియా వెల్లడించారు.అలియా భట్ నటించిన హైవే చిత్రానికి రణబీర్ ప్రమోషన్స్ చేయడం ఇలా వీరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

ఈ విధంగా అలియా భట్ పదకొండేళ్ళకే ప్రేమలో పడ్డారనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube