భూమిపై నడిచిన అతి పెద్ద జంతువు డైనోసార్ అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సముద్రంలో రెండు లక్షల కిలోల బరువు ఉండే బ్లూ వేల్ అతి పెద్దదైతే భూమిపై లక్షన్నర కిలోల బరువుండే డైనోసార్ అతి పెద్దది.
ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల వల్ల ఇవి కనుమరుగయ్యాయి.ఎన్నో సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ జాతుల గురించి ఇప్పటికీ మానవులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
వీటిపై సినిమాలు తీస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా డైనోసార్ కి సంబంధించి ఒక వీడియో అందరినీ అబ్బుర పడేలా చేస్తోంది.
ఈ వీడియోలో డైనోసార్ గుడ్డును పోలిన ఒక గుడ్డు నుంచి డైనోసార్ ను పోలిన ఒక పిల్ల బయటకు వచ్చింది.క్యూట్ పెట్స్ వైల్డ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన వీడియోకి ఇప్పటికే 15 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి
వైరల్ అవుతున్న వీడియోలో.
ఒక ల్యాబ్ లో అద్దాల లోపల 2 గుడ్లు ఉండటం చూడవచ్చు.అయితే ఒక యువతి గుడ్ల వద్దకు వచ్చింది.ఈమె ఒక సైంటిస్ట్ లాగా ప్రవర్తిస్తూ గుడ్ల గురించి ఏదో చెప్పింది.ఇంతలోనే ఒక గుడ్డు లోపల నుంచి ఒక జీవి బయటకు పొడుచుకు వచ్చింది.
ఇది చూసేందుకు గోధుమ రంగులో ఉంది.ఇంకా పరిశీలించి చూస్తే ఇది అచ్చం ఒక డైనోసార్ పిల్ల లాగానే ఉంది.
ఈ దృశ్యాలన్నీ వీడియో తీయగా… దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.క్యూట్ పెట్స్ వైల్డ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ వీడియోని షేర్ చేస్తూ ఇది నిజమైన డైనోసారా? లేకపోతే ఫేక్ దా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండని కోరింది.అయితే అందరూ కూడా ఇది ఒక ఫేక్ డైనోసార్ అని చెబుతున్నారు.మరికొందరు మాత్రం వావ్ ఇది నిజంగానే డైనోసార్ పిల్ల లాగా ఉంది అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోని మీకు కూడా చూసేయండి.