“విజువల్ ట్రీట్ తో వస్తున్న 105మినిట్స్ “హన్సిక మోట్వాని ప్రధాన పాత్ర లో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై “సింగిల్ షాట్” ” “సింగిల్ క్యారెక్టర్” లో నిర్మించిన చిత్రం “105 మినిట్స్” ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధం అవుతుంది.ఈ సందర్భంగా చిత్రం లో ముఖ్య భూమిక పోషించిన హన్సిక మోత్వాని మాట్లాడుతూ” సింగిల్ షాట్”” సింగిల్ క్యారెక్టర్ ” తో ఎంతో వైవిధ్యంగా నిర్మించిన ఈ చిత్రం నాకెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచి పోతుంది.
విజువల్స్ చూసాక షూటింగ్ లో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను.విజువల్స్ అంత అద్భుతంగా వస్తున్నాయి అని సంతోషం తో తెలిపారు.
నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ సినిమా అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది.మా డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది చాలా అద్భుతంగా తీసాడు.నిజంగా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించడం నాకు చాలా గర్వంగా ఉంది.త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తామని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.యస్.మాట్లాడుతూ ఇలాంటి ప్రయోగం నిజంగా దర్శకుడికి,నిర్మాత కి చాలా సాహసం అనే చెప్పాలి.ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషం గా ఉంది.
అని తెలిపారు.సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ సినిమా అనుకున్నదిఅనుకున్నట్టు చాలా బాగా వచ్చింది.“సింగిల్ షాట్” ” సింగిల్ క్యారెక్టర్” నా కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా ఉండిపోతుంది.అని తెలిపారు.
దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ హీరోయిన్ హన్సిక నటనకు తోడుగా మాడిఒపి కిషోర్ కెమేరా వర్క్,మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.యస్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ & సౌండ్స్ ఎఫెక్ట్స్ నిజంగా ప్రాణం పోసాయి.ప్రొడక్షన్స్డి సైనర్ బ్రహ్మ గారి వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది.
మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు.సినిమా త్వరలో మీ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అని తెలిపారు.ఇలాంటి ఒక ప్రయోగాత్మకమైన సినిమా కి పని చేయడం చాలా సంతోషంగా వుంది అని యూనిట్ సభ్యులు తెలిపారు.
.