రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విజయోత్సవంలో ఉన్నారు.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది.
ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాల పై దృష్టి సారించారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి పక్కా ప్లాన్ సిద్ధం చేశారు.
రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా, మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించారు.కనుక హీరోయిన్ తప్పనిసరిగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కాజల్ అగర్వాల్ వస్తానని వెల్లడించారు.ప్రస్తుతం ముంబై లో ఉంటున్న ఈమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవుతానని చెప్పడంతో నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ససేమిరా ఒప్పుకోవడంలేదు.ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న లేకపోయినా కనీసం హైదరాబాద్ వచ్చి పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతానని కాజల్ అగర్వాల్ చెప్పడంతో అందుకు రామ్ చరణ్ నో అని సమాధానం చెప్పారు.అయితే రామ్ చరణ్ ఇలా కాజల్ ప్రమోషన్ కార్యక్రమాలకు అడ్డు పడటానికి గల కారణం ఆమె గర్భవతి కావడంతో కాజల్ అగర్వాల్ ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తానని చెప్పినప్పటికీ రామ్ చరణ్ ఒప్పుకోవడం లేదు.
RRRఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఆచార్య సినిమా హిట్ కూడా తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.