అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ అత్యున్నత స్థాయి గోల్డ్ అవార్డును అందుకుంది.

ఆటో విడిభాగాల రంగంలో విభాగపు టాపర్‌గా గుర్తింపు పొందింది.అత్యంత కఠినమైన ఈహెచ్‌ఎస్‌ ప్రక్రియల పట్ల ఏఆర్‌బీఎల్‌ నిబద్ధతకు నిదర్శనంగా ఈ గుర్తింపు నిలుస్తుంది.

 Amara Raja Batteries Wins Gold At Cii Ehs Awards , Amara Raja Batteries, Cii Ehs-TeluguStop.com

తిరుపతి, 1,2022 : అమర రాజా గ్రూప్‌లో భాగమైన అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌బీఎల్‌)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఐఐ–ఎస్‌ఆర్‌ ఈహెచ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ నుంచి అందుకుంది.ఆరోగ్యం, పర్యావరణం, భద్రత పరంగా అత్యంత కఠినమైన ప్రక్రియలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేశారు.

అత్యున్నతమైన గోల్డ్‌ అవార్డును ఏఆర్‌బీఎల్‌ గెలుచుకుంది.ఆటో విడిభాగాల రంగంలో ఇది అగ్రగామిగానూ నిలిచింది.

మొత్తం 194 కంపెనీలు పాల్గొనగా ఈ గౌరవాన్ని పొందిన అగ్రగామి 20 కంపెనీల సరసన ఏఆర్‌బీఎల్‌ నిలిచింది.ఏఆర్‌బీఎల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ సీ నరసింహులు నాయుడు మాట్లాడుతూ ‘‘ అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదిక వద్ద ఈ గుర్తింపును పొందడంలో విజయం సాధించిన మా బృందాల పట్ల నేను గర్వంగా ఉన్నాను.

ఈహెచ్‌ఎస్‌ అత్యుత్తమ ప్రక్రియల దిశగా మా నమ్మకాన్ని ఈ అవార్డు పునరుద్ఘాటించడం మాత్రమే కాదు, ఏఆర్‌బీఎల్‌ సంస్కృతిని సైతం ప్రదర్శిస్తుంది.ఇది ఈహెచ్‌ఎస్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వినూత్నమైన, ఉద్యోగుల ప్రమేయ పద్ధతులు, ప్రేరణాత్మక అంశాలను పెంపొందించడానికి మరియు భద్రతా నమూనాలు , సస్టెయినబల్‌ కార్యక్రమాలు సైతం ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.

ఏఆర్‌ఈఎల్‌ లెడ్‌ యాసిడ్‌ బిజినెస్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన గౌరినేని మాట్లాడుతూ ‘‘ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న ఏఆర్‌బీఎల్‌ బృందంలో ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.ఏఆర్‌బీఎల్‌ వద్ద మేము ఎప్పుడూ కూడా అత్యున్నత ఈహెచ్‌ఎస్‌ ప్రమాణాలు ఏర్పరచాలని, వాటిని అందుకోవాలని ప్రయత్నిస్తుంటాము.

పర్యావరణం, ఆరోగ్యం మరియు భద్రతా ప్రక్రియల దగ్గరకు వచ్చేసరికి అగ్రగాములుగా నిలువాలని మేము ప్రయత్నిస్తుంటాము.ఇది కేవలం మా ప్రయత్నాలకు గుర్తింపును అందించడం మాత్రమే కాదు మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు స్ఫూర్తినీ అందిస్తుంది’’ అని అన్నారు.

ఏఆర్‌బీఎల్‌ అనుసరి ంచే ప్రపంచశ్రేణి, నిలకడతో కూడిన పర్యావరణ, ఆరోగ్య మరియు భద్రతా (ఈహెచ్‌ఎస్‌) ప్రక్రియలకు నిదర్శనంగా ఈ అవార్డు నిలుస్తుంది.పర్యావరణ నిర్వహణ, పారదర్శకతల పట్ల కంపెనీ యొక్క నిబద్ధత దాని వృద్ధిలో స్థిరంగా ఉండటం మాత్రమే కాదు, ప్రతి సంవత్సరమూ అది మరింత వేగవంతమవుతుంది.

అత్యంత కీలకమైన పర్యావరణ వనరులను పరిరక్షించడం, వృత్తిపరమైన ఆరోగ్య, పరిశుభ్రతా సమస్యలను నిర్వహించడం , ఈహెచ్‌ఎస్‌ రంగంలో వినూత్నమైన మరియు సమర్థవంతమైన నిర్వహణ పద్ధతులను సులభతరం చేయడంలో కంపెనీల సహకారాన్ని గుర్తించడానికి ఈ అవార్డులు ఏర్పాటు చేయబడ్డాయి.మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సస్టెయినబిలిటీ సవాళ్లకనుగుణంగా ఉండడం తమ బాధ్యత అని ఏఆర్‌బీఎల్‌ నమ్ముతుంది.

దీనికి అనుగుణంగా, ఈ కంపెనీ పర్యావరణ పరంగా తమ వ్యాపారాలు చూపే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడానికి స్ధిరంగా తమ కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube