ఈ సమస్త విశ్వములో తల్లికి మించిన దైవం మరొకటి లేదనేది జగమెరిగిన వాస్తవం.మహానుభావులు కూడా పదేపదే ఈ విషయాన్నే ఉటంకిస్తుంటారు.
ఈ భూమి మీద కదిలే దైవం పేరే అమ్మ.అందుకే ప్రజలు తల్లిని దేవుడి కంటే ఎక్కువగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ఆరాధిస్తారు.
ఏ తల్లి అయినా తన పిల్లలు ఆపదలో ఉంటే తట్టుకోలేదు.వారికోసం ఏం చేయడానికైనా వెనుకాడదు.వారికి చిన్నపాటి కష్టం వచ్చినా తట్టుకోలేదు.ఇక ఇది అన్నిటికీ వర్తిస్తుంది.మనిషి నుండి జంతు పశు పక్ష్యాదులకు కూడా ఇదే వర్తిస్తుంది.ఈ విషయాన్ని మనకు గుర్తు చేసే సంఘటనలు మన చుట్టూ అనేకం జరుగుతూ ఉంటాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనే ఒకటి వైరల్ అవుతోంది.ఇక ఈ వీడియో నెటిజన్ల హృదయాలని గెలుచుకుంది.ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇపుడు తెలుసుకుందాం.ఇందులో ఒక తల్లి పక్షి తన పిల్లల కోసం పడే ఆరాటం మనకు కనిపిస్తోంది.
ఈ వీడియోలో గూడులో ఉన్న ఒక పక్షి పిల్లలు భారీ వర్షంలో తడుస్తూ ఉంటాయి.దాన్ని గమనించిన తల్లి పక్షి తన పిల్లల దగ్గరకు చేరుకొని తన రెక్కలతో పిల్లలని తడవకుండా రక్షించడానికి ప్రయత్నిస్తుంది.
సదరు వీడియో చూసిన నెటిజన్లు తల్లిపక్షిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని IFS అధికారి అయినటువంటి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా దాదాపు 37 వేల మందికి పైగా దీన్ని తిలకించారు.దీంతో పాటు తల్లి పక్షిపై నెటిజన్లు రకరకాల రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు.అందులో ఒక నెటిజన్ “తల్లి హృదయానికి అవధులు లేవు” అని, మరొక నెటిజన్ “తల్లికి మించిన దైవం లేదు” అని, వేరొక నెటిజన్ “మా అమ్మ గుర్తొస్తోంది!” అంటూ కామెంట్లు చేసారు.
ఇక మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.