తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు లో ఉన్న హాట్ యాంకర్ లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.
అనసూయ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీబిజీగా గడుపుతోంది.ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
ఇది ఇలా ఉంటే అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.అంతేకాకుండా ఆమె మాట్లాడే వ్యాఖ్యలు చేసే ట్వీట్లు, ఫోటో షూట్ లు ఎప్పుడు కాంట్రవర్సీ లకు దారి తీస్తూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే ట్రోలర్స్, నెటిజన్స్ అసూయ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా ట్రోలింగ్ చేద్దామా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక తనపై మితిమీరి ట్రోలింగ్స్ చేసే వారికి అనసూయ తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ డే అంటూ ట్వీట్ చేయకుండా ట్రోలర్స్, మీమర్స్ ఫై సెటైర్స్ వేసింది.ట్రోలర్స్, మీమర్స్ కీ ఈ రోజు మహిళలంటే విపరీతమైన గౌరవం వచ్చినట్టుందే.
అయినా అది 24 గంటల్లో పోతుందిలేండి అని కౌంటర్ వేసింది.దీనిపై నెట్టింట్లో రచ్చ రచ్చ జరిగింది.
అనసూయ మీద నెటిజన్లు కామెంట్లతో దాడి చేశారు.
ఆ తరువాత అనసూయ మరో ట్వీట్ వేస్తూ గుమ్మడి కాయ దొంగలు అంటూ మరో ట్వీట్ వేసింది.అయితే అనసూయను మాత్రం నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేసేశారు.మదర్ థెరిస్సా, మేరీ కోమ్ వంటి వారిని ఎవ్వరూ కూడా ట్రోల్ చేయరు.
మనం చేసే పనులే మనకు విలువనిస్తాయ్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు.ఈ ట్రోలింగ్ ఫై స్పందించిన అనసూయ సన్నిహితులు నువ్వు ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చే సక్సెస్‌ఫుల్ మహిళవి.
ట్రోలర్స్, మీమర్స్, మొహం తెలియని వాళ్లు చేసే నెగెటివ్ కామెంట్లు నిన్నే ఇంకా బలవంతురాలిని చేస్తాయ్.అలాంటి వారిని చూసినప్పుడు నాకు చిరాకు కాకుండా జాలి వేస్తుంటుంది.
నువ్ నీ వ్యక్తిత్వంతో ఇన్నేళ్లుగా కెమెరాముందుంటూ లైమ్ లైట్‌లో ఉన్నావ్.విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటూ అనసూయ ఫ్రెండ్ ఒకరు మెసెజ్ పెట్టేశారట.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.