న్యూస్ రౌండప్ టాప్ 20

1.గవర్నర్ ను అవమానిస్తున్నారంటూ సీతక్క ఆవేదన

Telugu Cm Kcr, Corona, Gst Handlooms, Ktr, Mumbai, Lokesh, Telangana, Telugu, To

గవర్నర్ బీసీ మహిళ కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ నేతల డ్రామాలో గవర్నర్ ను అవమానిస్తున్నారని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.11 వ పిఆర్సి నివేదిక విడుదల

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 11వ పిఆర్సి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది.

3.సీఎల్పీ భేటిని బహిష్కరించిన జగ్గారెడ్డి

Telugu Cm Kcr, Corona, Gst Handlooms, Ktr, Mumbai, Lokesh, Telangana, Telugu, To

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ భేటీ ని బహిష్కరించారు.

4.బీజేపీ అధికారంలోకొస్తే ఉచిత విద్య

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య , వైద్యం అందిస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.

5.మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంపు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

6.మంత్రి కేటీఆర్ పై షర్మిల కామెంట్స్

Telugu Cm Kcr, Corona, Gst Handlooms, Ktr, Mumbai, Lokesh, Telangana, Telugu, To

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.రుణ మాఫీ చేయడం లేదు కాబట్టి , మీరు రాజీనామా చేస్తారా అని కేటీఆర్ ను ఉద్దేశించి షర్మిల విమర్శలు చేశారు.

7.తెలంగాణ మంత్రి కి నిరసన సెగ

Telugu Cm Kcr, Corona, Gst Handlooms, Ktr, Mumbai, Lokesh, Telangana, Telugu, To

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నిరసన సెగ తగిలింది.మంత్రి ఓ సభలో మాట్లాడుతున్న జీహెచ్ఎంసీకి చెందిన మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు.

8.అటవీ శాఖ అధికారులపై సీతక్క ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి లో పొడు సాగు భూములలో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా ట్రెంచ్ పనులు నిర్వహించడం జరిగింది ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

9.యాదాద్రి ల మూడో రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

10.నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

Telugu Cm Kcr, Corona, Gst Handlooms, Ktr, Mumbai, Lokesh, Telangana, Telugu, To

నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

11.ఏపీ గవర్నర్ కు నారా లోకేష్ లేఖ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ని రీకాల్ చేయాలని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.

12.శ్రీవారి సేవలో ఎన్.వి.రమణ దంపతులు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

13.కర్నూలు జిల్లా లో బాంబు కలకలం

కర్నూలు జిల్లా లో బాంబు కలకలం సృష్టించింది.కర్నూలు జిల్లాలోని పత్తికొండ లో స్త్రీ శిశు సంక్షేమ భవనం వెనకాల ఉన్న ఓ భవనంలో స్థానికులు నాటుబాంబు ను గుర్తించారు.

14.పల్నాడు కు  జాషువా పేరు పెట్టాలి

నరసరావుపేట ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న డంతో ఆ జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

15.రాష్ట్ర ఉత్సవంగా పొట్టి శ్రీరాములు జయంతి

అమరజీవి పొట్టి శ్రీరాములు 121 వ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

16.సెబ్ డైరెక్టర్ బదిలీ

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రామకృష్ణ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

17.చేనేత పై జిఎస్టి రద్దు చేయాలి

Telugu Cm Kcr, Corona, Gst Handlooms, Ktr, Mumbai, Lokesh, Telangana, Telugu, To

చేనేత రంగాన్ని కుదేలు చేస్తున్న జి.ఎస్.టి ని రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

18.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.త్వరలో టీటీడీ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం

త్వరలోనే టీటీడీ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం చేపట్టనున్నట్టు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ప్రకటించారు.

20.ఈ రొజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,400

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,800

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube