కేసీఆర్ ప్రీ ప్లాన్‌... అప్పుడే టికెట్ల వేట షురూ..!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నికల సెగ‌ను సీఎం కేసీఆర్ ర‌గిలించిన విష‌యం విధిత‌మే.2023 డిసెంబ‌ర్‌లో రాష్ట్ర ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.అయితే అంత‌కు ముందే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స‌మాచారం.2022 ఏప్రిల్‌లో జ‌రిగే క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌పే అవ‌కాశం లేక‌పోలేదు.ఆ దిశ‌గా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేంగంగా మారుతున్నాయి.ఈ నేప‌థ్యంలో టిక్కెట్ల కోసం ఆశావ‌హులు అధినేత‌ల చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ట్టు తెలిసింది.కాగా ఇందులో ఉద్యోగాలు చేసే ఉన్న‌తాధికారులు ఉండ‌డం చ‌ర్చ‌ణీయాంశంగా మారుతోంది.

 Cm Kcr Trs Party Tickets Telangana Early Elections Details, Early Elections, Te-TeluguStop.com

ముఖ్యంగా రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు గ‌డ‌ల శ్రీనివాస‌రావు పేరు వినిపిస్తోంది.

అలాగే జీఎస్ార్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో వైద్య సేవ‌లందిస్తున్న ఆయ‌న బ‌రిలోకి దిగే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు వినికిడి.అధికార పార్టీ నుంచి సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మామిళ్ల రాజేంద‌ర్ కూడా ముమ్మ‌ర ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌.

అలాగే నిజామాబాద్ సీపీ కేఆర్ నాగ‌రాజు సైతం రాబోయే ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచేందుకు య‌త్నిస్తున్న‌ట్టు తెలిసింది.ఇక వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట‌(ఎస్పీ) నియోజ‌క‌వ‌ర్గం గానీ, వ‌రంగ‌ల్ లోక్‌స‌భ స్థానం నుంచి బ‌రిలో దిగాల‌ని భావిస్తున్నార‌ని టాక్‌.

పెద్ద‌పెల్లి జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) ల‌క్ష్మీనారాయ‌ణ త‌న స్వంత జిల్లా వ‌న‌ప‌ర్తి నుంచి పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది.

అలాగే జ‌గిత్యాల జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి(డీటీఓ), ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయ‌క‌ఖ్ భ‌ర్త శ్యాంనాయ‌క్ కూడా టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని యోచిస్తున్నార‌ట‌.ఇక ములుగు ఎమ్మెల్యేకు ధీటుగా ఎదుర్కొన‌డానికి ములుగు డీఎంహెచ్ఓ అల్లెం అప్ప‌య్య పోటీకి దిగే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.జిల్లా డీఎంహెచ్వోగా పనిచేస్తున్న అల్లెం అప్పయ్య పోటీకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఈయ‌న ఆదివాసీ కోయ సామాజిక వ‌ర్గానికి చెందిన వాడు కావ‌డంతో టీఆర్ ఎస్ కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ బ్యాచ్‌మెట్ రిటైర్డ్ డీసీపీ రాంన‌ర్సింహారెడ్డి భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌వ‌ర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్నార‌ని తెలిసింది.

మొగుళ్ల‌ప‌ల్లి మండ‌లానికి చెందిన ఆయ‌న ఇప్ప‌టికే ఆర్ఎన్ఆర్ ట్ర‌స్ట్ పేరి ట సేవాకార్య్ర‌క‌మాలు చేప‌డుతున్నారు.మండలానికి చెందిన ఆయన ఇప్పటికే ఆర్ఎన్ఆర్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర క్యాడ‌ర్ అధికారిగా ప‌నిచేస్తున్న ఐఏఎస్ అధికారి ప‌రికిపండ్ల న‌ర‌హ‌రి స్వ‌చ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్ర‌మాలు చేప‌డుతున్నారు.ఆయ‌న‌కూడా భ‌విష్య‌త్‌లో ఏదైనా ఒక పార్టీ నుంచి రామ‌గుండం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని భోగ‌ట్టా.విద్యుత్‌శాఖ ఏఈ మేడి ర‌మేష్ స‌తీమ‌ణి మేడి ప్రియ‌ద‌ర్శిని బీఎస్‌పీ న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.ఈసారి ర‌మేష్ బీఎస్పీ త‌ర‌పుఉన పోటీ చేయాల‌నుకుంటున్నార‌ట‌.మొత్తంగా తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి మాత్రం షురూ అయింది.అధిష్టానం మెప్పుకోసం, టిక్కెట్ పొందేందుకు ఇప్ప‌టి నుంచే ముమ్మ‌ర ప్రయ‌త్నాలు చేయ‌డం విశేషం.

మ‌రి ఎవ‌రిని టిక్కెట్ వ‌రిస్తుందో తెలుసుకోవాలంటే మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Cm Kcr Trs Party Tickets Telangana Early Elections Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube