తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు, ఈ రోజు ఎంతో చరిత్ర ఉన్న జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో శివుణ్ణి దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సీఎస్ షోమేష్ కుమార్ అన్నారు.మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగతులోని ప్రముఖ శైవ క్షేత్రం ఐన శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన కుటుంభ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.
సీఎస్ కి ఆలయ అర్చకులు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీవో జగదేశ్వర్ రెడ్డి లు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అమవాస్యకు ఈ టెంపుల్ కి లక్ష మంది భక్తులు వస్తారని, టెంపుల్ లో ఉన్న సమస్యలను డైరెక్టర్లు నా దృష్టికి తీసుకవచ్చారు.
సంభాధిత అధికారులతో చర్చించి టెంపుల్ అభివృద్ధికి కృషి చేస్తానాని, ఇంత చరిత్ర ఉన్న దేవాలయంలో అన్ని వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.బైట్ : సోమేశ్ కుమార్ సీఎస్ తెలంగాణ రాష్టం.