గిఫ్ట్‌గా బ్రహ్మాజికి బెంజ్ కారు.. గాల్లో తేలిపోతోన్న నటుడు

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు, సామాన్య ప్రజలకు సోషల్ మీడియా బాగా అలవాటు పడింది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో పంచు కుంటున్నారు.

 Benz Car As A Gift To Brahmaji He Felt So Happy , Brahmaji , Tollywood , Car , G-TeluguStop.com

తాము ఏది చేసినా సోషల్ మీడియాలో గొప్పగా పంచుకుంటున్నారు.ముఖ్యంగా సెలబ్రెటీలు తాము చిన్న కుక్కపిల్లను కొన్నా కూడా వెంటనే షేర్ చేసు కుంటున్నారు.

ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమ ఫోటో షూట్లను, తాము కొన్న విలువైన వస్తువులను షేర్ చేసుకోగా.తాజాగా ఓ సినీ నటుడు తాను గిఫ్ట్ గా పొందిన కారును తన అభిమానులకు షేర్ చేసుకున్నాడు.

ఇంతకీ ఆయన ఎవరో కాదు బ్రహ్మాజీ.తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.

ఎన్నో సినిమాలలో నటించిన బ్రహ్మాజీ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించాడు.

ఆ తర్వాత సహాయ పాత్రలలో నటించి ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు బ్రహ్మాజీ.తొలిసారిగా ఆడదీ సినిమాతో 1990లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు బ్రహ్మాజీ.

ఆ తర్వాత సీతారామరాజు, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలలో నటించగా సింధూరం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అలా హీరో గా కొంతకాలం సాగగా ఆ తర్వాత సహాయ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు.

ఇక ఆయన నటించిన ఖడ్గం, మర్యాద రామన్న, మిరపకాయ్ వంటి పలు సినిమాలలో తన పాత్రలకు మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఏడాదికి వరుస సినిమాలతో బాగా బిజీ గా మారాడు బ్రహ్మాజీ.ఏ సినిమాలోనైనా తన పాత్రకు మంచి క్రేజ్ అందుతుంది.

గత ఏడాది వరుసగా పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కున్నాడు.

ఇక ఈ ఏడాది హీరో.ఇటీవల విడుదలైన డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే.సోషల్ మీడియా ప్రభావం బ్రహ్మాజీ పై కూడా ఎక్కువగానే ఉంది.

ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో బాగా పంచుకుంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తుంటాడు.

అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక కొన్ని విషయాల పట్ల కూడా బాగా స్పందిస్తుంటాడు బ్రహ్మాజీ.

ఇదిలా ఉంటే తాజాగా తను బెంజ్ కారును గిఫ్ట్ గా పొందాడు.దీంతో దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఫోటో కి తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

పలువురు సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.మొత్తానికి కొత్త కారు గిఫ్టుగా పొందిన బ్రహ్మాజీ గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇక ఈ విలువైన గిఫ్ట్ ను బర్త్ డే గిఫ్ట్ గా పొందినట్లు తెలిపాడు.ప్రస్తుతం ఆ కారు ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

Benz Car As A Gift To Brahmaji He Felt So Happy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube