చేతిలో అంత పెద్ద బాంబ్ ను పెట్టుకున్నా.. అతని పాజిటివ్ ఆటిట్యూడ్ చూడండి..

మనలో చాలామంది దీపావళి టపాసులను కాల్చడానికి, అవి పెలుతున్నపుడు వాటి శబ్దాలకే చాలా మంది భయపడుతూ ఉంటారు.కానీ ఈ వీడియోలో మాత్రం ఏకంగా బాంబ్ ని తన చేతిలో పట్టుకున్నాడు.

 Ukraine Civilian Removes Landmine With Bear Hand Details, Bomb In Hand, Viral V-TeluguStop.com

ఈ వ్యక్తి పాజిటివ్ యాటిట్యూడ్ చూస్తుంటే మతి పోవాల్సిందే.అసలు ఎందుకు ఈ వ్యక్తి బాంబ్ ని చేతిలో పట్టుకున్నాడు అన్న వివరాల్లోకి వెళితే.

ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పుకోను అక్కర్లేదు . రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ మీద ఎలాంటి దాడులు చేస్తుందో అందరికీ తెలిసిందే.  కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మాత్రం ఈ దాడులకు ఏ మాత్రం భయ పడకుండా తన దేశ పౌరులను, సైనికులను ముందుండి మరి ఈ దాడులను ఎదుర్కొంటున్నారు.పౌరులు, సైనికులే కాకుండా ఉక్రెయిన్ ప్రజలు కూడా రంగం లోకి దిగి వారి శత్రువులని ఎదుర్కొంటున్నారు .దీనికి సంబంధించిన వీడియోలు అనేక ఇంటర్నెట్లో మనం చూసే ఉంటాము.

ఈ రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్ లోని చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.

వారి కుటుంబాల అనాధలుగా మారుతున్నాయి.కానీ వీటికి భయపడకుండా ఉక్రెయిన్ ప్రజలు వారి మీద జరిగే దాడులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.

ఇక్కడి ప్రజలు చేస్తున్న పోరాటాలకు సంబంధించి ఒక వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియోలో ఓ ఉక్రెయిన్ వ్యక్తి రష్యా సైనికులు భూమిలో ఏర్పరిచిన ల్యాండ్ మైన్ ను చేతుల్లో పట్టుకుని, నోటిలో సీగ్రెట్ తాగుతూ అసలు అది బాంబే కానట్టు ఏదో పిల్లలు ఆడుకునే వస్తువు లాగా చాలా ఈజీగా దాన్ని తీసుకుని ఖాళీ ఉండే ప్రదేశానికి చాలా సింపుల్ గా తీసుకెళ్తున్న ఈ దృశ్యం అందరినీ షాక్ కి గురిచేస్తుంది.మామూలుగా ల్యాండ్ మైన్ చూస్తేనే పై ప్రాణాలు పైకే పోతాయి కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా తన చేతుల్లో ల్యాండ్ మైన్ తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ల్యాండ్ మైన్ ఒకవేళ పొరపాటున పేలితే భారీ విద్వంసం చోటు చేసుకుంటుంది.

అలాంటి ఈ బాంబ్ ను తన చేతుల్లోకి తీసుకున్న ఈ వ్యక్తికి నెటిజెన్స్ కూడా ప్రశంసలు అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube