పవన్ సినిమా కోసం చంద్రబాబు లోకేష్ లు పిల్లిమొగ్గలు వేస్తున్నారు.. మంత్రి పేర్ని నాని

అమరావతి: మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.పవన్ సినిమా కోసం చంద్రబాబు లోకేష్ లు పిల్లిమొగ్గలు వేస్తున్నారు.

 Minister Perni Nani Fires On Chandrababu Nara Lokesh Pawan Kalyan Details, Minis-TeluguStop.com

సినిమాని కూడా తండ్రీకొడుకులు రాజకీయాలకు వాడుకుంటున్నారు.పవన్ సినిమాని తొక్కడం ఏంటో మాకు అర్ధం కావడం లేదు.

చట్టం అమలు అవుతుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి.? జీవో 35 పై ప్రతీ సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హై కోర్టు ఆదేశించింది.నీతి వ్యాఖ్యలు చెప్పే పవన్ కి అది తెలీదా.అలాంటి పక్రియ ఎందుకు చేసుకోలేదు.ఎక్కడైనా జాయింట్ కలెక్టర్ కి లెటర్ పెట్టారా.? హై కోర్టు తీర్పు అన్నా.ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్క లేదు.

ఏపీలో టీడీపీ, బీజేపీ జనసేన పార్టీలు బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సాహిస్తున్నాయి.

కొత్త జీవో విడుదల చేయడానికి పక్రియ జరుగుతుంది.లీగల్ ఒపీనియన్ కి వెళ్ళింది.

అన్ని సక్రమంగా జరిగి ఉంటే 24 తేదీన జీవో రావాల్సి ఉంది.ఇంతలో మా మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో మేమంతా ఆవేదనలో ఉన్నాం.

ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేసుకున్నారు సినిమాని ఇంకో రెండు రోజులు వాయిదా వేసుకోలేరా.జీవో వచ్చే వరకూ ఆగలేరా.? ఏపీలో సినిమాని ప్రీ గా చూపిస్తాను అన్న పవన్ బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకు.? చంద్రబాబు, లోకేష్ లకు పవన్ సినిమా పై ఉన్న ప్రేమ జూ.ఎన్టీఆర్ సినిమా పై ఎందుకు లేదు.

జూ.ఎన్టీఆర్ సినిమా చూడాలని ఉందని ఎందుకు అనలేదు.? మీ ఎంపీ బావమరిది మహేష్, జూ ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు చూడండి అని ఎప్పుడైనా ట్విట్ చేసారా.ఇండస్ట్రీ అంటే పవన్ ఒక్కడేనా.మిగతా సినిమాలు లేవా.జనాలు పవన్ సినిమా ఒక్కటే కాదు బాగుంటే అందరి సినిమాలు చూస్తారు.బాగుంది కనుకే అత్తారింటికి దారేది చూసారు బాలేదు కనుకే అజ్ఞతవాషి చూడలేదు.

అఖండ విడుదలకి ముందు సినిమా నిర్మాతలు నన్ను కలిశారు.బాలక్రిష్ణ నన్ను కలుస్తానని చెప్పారు.సినిమా విడుదలకి ముందు సీఎం జగన్ ని కలుస్తానని బాలకృష్ణ నన్ను అడిగారు.సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తే ఆయనకి పేరు పోతుంది కావాల్సింది చేసిపెట్టండి అని నాతో అన్నారు.

ఇది నిజమో కాదో బాలకృష్ణ చెప్పాలి.సోమవారం కమిటీ సమావేశం జరుగుతుంది.రిపోర్టు ఆధారంగా జీవో వస్తుంది.థియేటర్ అనేవి నిబంధనల ప్రకారం నడుస్తాయా.మీ ఇష్టం వచ్చినట్లు నడిపిస్తారా.డిమాండ్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన రేట్లు అమ్మితే అధికారులు అడ్డుకుంటారు.

Minister Perni Nani Fires On Chandrababu Nara Lokesh Pawan Kalyan Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube