తెలంగాణ కాంగ్రెస్‌లో రెండు అడుగులు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కి లాగుతున్నారనేది విధితమే.టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఆ పార్టీ నేతల్లో అనేక మందికి ఇష్టం లేదు.
ఎలాగోలా సర్ధుకు పోయినా కొందరు మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా రేవంత్‌ను.పంటి కింద రాయిలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఇటీవల రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఈ క్రమంలోనే జగ్గారెడ్డి తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు.
అంతకు ముందు కూడా జగ్గారెడ్డి వివాదం టీ కప్పులో తుఫాన్ లాంటిదే అంటూ చెప్పు కొచ్చారు.ఇప్పుడు కూడా జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చిందని, సీనియర్ నేతలు ఆయనతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు.
జగ్గారెడ్డి తమ నాయకుడని, పార్టీ అధినాయత్వం అపాయింట్ మెంట్ కోరానని, జగన్‌కు అండగా ఉంటామని చెప్పారు.
అయితే మూడు రోజులుగా జగ్గారెడ్డి జగడం మామూలుగా లేదు.
ఇదే విషయమై మొన్న మేడారంలో రేవంత్ స్పందించి మాట్లాడారు.కుటుంబ సమస్యగా చెప్పుకొచ్చారు.
అయినా వివాదం సద్దుమణగకపోవడంతో మళ్లీ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారని, ఇలాంటి విషయంలో మనో ధైర్యంతో ఉండాలని సూచించారు.
మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారని అన్నారు.జగ్గరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తమని వెల్లడించారు.
గతంలోనూ ఇలాంటి పరిస్థితే వీహెచ్ విషయంలో ఎదురైందని చెప్పుకొచ్చారు.
తనకు జగ్గారెడ్డి వ్యక్తిగతం మంచి మిత్రుడని , తాను రాజకీయాల్లోకి రాకముందు కూడా పరచయం ఉందని చెప్పారు.అందరం కలసి మాట్లాడు కుందామని అన్నారు.పీసీసీ చీఫ్‌గా కొన్ని విషయాలు బహిర్గతంగా మాట్లడలేనని చెప్పొకొచ్చారు.
రాష్ట్రంలో అధికారంలోకొచ్చేందుకు కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు.అయితే వివాదం సద్దుమణుగు తుందనే భావనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.
అందుకే ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.అయినా జగ్గారెడ్డి, వీహెచ్ విషయంలో రేవంత్ కు సమస్యలు తప్పేట్లు లేవనే భావన ప్రజల్లో ఉండడం కొసమెరుపు.