బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా మూడో వార్డు లో గల జయేంద్ర నగర్ పార్కును వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించారు.
అనంతరం పార్కును శుభ్రం చేసి మొక్కలు నాటారు.వార్డులో గృహ లా వద్దకు వెళ్లి స్వయంగా తడి చెత్త పొడి చెత్తను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా సరే శిక్షార్హులే అని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నాలు దినకర్ నగరాన్ని, పార్కులను అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
భారతదేశంలో కాకినాడ నగరానికి బెస్ట్ లివింగ్ సిటీగా నాలుగో స్థానం ఉందని దీనిని ఇలాగే మనం కొనసాగించాలని కోరారు.కాకినాడ నగరానికి పెన్షనర్ ప్యారడైజ్ గా మంచి పేరు ఉందని, కాకినాడ నగరం దిన దిన అభివృద్ధి చెందుతుందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ సుంకర శివ ప్రసన్న విద్యాసాగర్, కమిషనర్ స్వప్నాల దినకర్, జాయింట్ కమిషనర్ నాగ నరసింహారావు, కార్పొరేటర్ వడ్డే మణికుమార్, ఎం హెచ్ ఓ పృద్వి చరణ్ పృద్వి చరణ్ రెడ్ క్రాస్ చైర్మన్ వై డి రామారావు, వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.