వైరల్ వీడియో: డేగను చుట్టేసిన పాము.. చివరికి..?!

వేసవికాలంలో అడవిలో జంతువులు, చిన్న ప్రాణులు ఎక్కువగా బయట తిరగవు.ఇలాంటి సమయంలో ఇతర జీవులను వేటాడేందుకు డేగలు, పాములు వంటివి అలుపెరగకుండా ఓపెన్ ప్లేసులలో తిరుగుతుంటాయి.

 The Snake That Wrapped The Eagle At The End Viral Latest, Viral News, Social Med-TeluguStop.com

అయినప్పటికీ వాటికి చాలా తక్కువగా ఆహారం లభిస్తుంది.అలా నెలల పాటు ఆహారం దొరక్క కడుపు మాడ్చుకునే ఈ జీవులు ఎలాంటి ప్రమాదకరమైన జీవిపైనైనా దాడి చేసి వాటిని చంపడానికి రెడీ అవుతుంటాయి.

పాములు అత్యంత విషపూరితమైనవని తెలిసినా కూడా డేగలు వాటిపై దాడి చేస్తుంటాయి.ఈ క్రమంలో డేగలు ప్రాణాలు కూడా పోవచ్చు.

ఎందుకంటే పాములు డేగలతో సమర్థవంతంగా పోరాడగలవు.డేగరెక్కలను గట్టిగా చుట్టేసి వాటిని చంపగల శక్తి కూడా పాములకు ఉంటుంది.

ఇవి రెండూ కోట్లాటకు దిగితే ఆ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.అయితే తాజాగా అలాంటి ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో… ఒక పాము నేలపై చకచకా పాక్కుంటూ వెళుతున్నట్లుగా కనిపించింది.

అయితే డేగ కళ్ళు చాలా పవర్‌ఫుల్ కాబట్టి నేలపై సంచరిస్తున్న దీన్ని అది వెంటనే పసిగట్టింది.ఈరోజు తనకు ఆహారం దొరికిందన్న సంతోషంతో అది క్షణాల వ్యవధిలోనే నేలపైకి చేరుకుంది.

పామును చంపేసి ఎంచక్కా తిందాం అనుకుంది.కానీ అప్రమత్తమైన పాము డేగ నుంచి చాకచక్యంగా తప్పించుకొంది.

అనంతరం ఆ పాము డేగను గట్టిగా చుట్టేసింది.దీంతో ఆహారం కోసం అని వచ్చిన ఆ డేగ ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పాము చాలా గట్టిగా డేగని చుట్టేయడంతో అది కిందపడిపోయి ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంది.

ఈ క్రమంలోనే అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి దీనిని గమనించాడు.

చాలా నిస్సహాయక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న డేగను ఆయన కాపాడాలనుకున్నాడు.ఆలస్యం చేయకుండా ధైర్యం చేసి డేగ చుట్టూ చుట్టుకున్న పాముని విడిపించాడు.

ఈ విడిపించే క్రమంలో అతడు చాలా కష్టపడాల్సి వచ్చింది.ఎందుకంటే ఆ పాము డేగ కాళ్లకు ఒక లాక్ వేసినట్టుగా గట్టిగా చుట్టేసింది.

దీంతో తనకు తానుగా డేగ విడిపించుకోలేకపోయింది.అదృష్టం కొద్దీ సదరు వ్యక్తి పామును విడిపించడంతో డేగ ప్రాణాలతో బయట పడింది.

అనంతరం అక్కడి నుంచి తుర్రుమంది.ఆ దృశ్యాలన్నీ మరొక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో, ఇది చాలా భయంకరంగా ఉంది అని షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube