కళావతి సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మహేష్ ప్రేమలో మునిగి తేలుతున్నాడుగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Sarkaru Vaari Paata S First Single Kalaavathi Promo Out , mahesh Babu , Kalaava-TeluguStop.com

మరి ఆ ఎదురు చూపులకు ఫలితం వచ్చింది. సర్కారు వారి పాట సినిమా మొదటి సింగిల్ ప్రోమో కొద్దీ సేపటి క్రితమే వచ్చింది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ పాటను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు థమన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.ప్రేమికుల రోజున ఈ సినిమా నుండి సాంగ్ రాబోతుండడంతో ఈ పాటపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే ఈ రోజు ఈ పాట ప్రోమోను రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక థమన్ చెప్పినట్టుగానే ఈ సాంగ్ అదిరిపోయింది.

సిద్ శ్రీరామ్ మెస్మరైజింగ్ వాయిస్ తో ఈ ప్రేమ పాట ప్రేమికులను వేరే లోకంలో విహరించేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ ప్రోమోలో మహేష్ లుక్స్, కీర్తి అందం హైలెట్ అని చెప్పాలి.

మహేష్ వైట్ కలర్ టీ షర్ట్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడు.ఆయనకు తగ్గట్టు కీర్తి చీరలో తళుక్కున మెరిసింది.

ఒక వెయ్యో.ఒక లక్షో మెరుపులు కిందకు దుకాయో.ఏంటో ఈ మాయ అంటూ కీర్తి అందాన్ని పొగుడుతూ మహేష్ ప్రేమ పరవశంలో మునిగి తేలుతూ కనిపించాడు.ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

ఇక ఈ సినిమాతో మహేష్ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

https://youtu.be/bwrBhrXfKbs
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube