పబ్లిక్ తో నాలా ఎవరూ కలవలేరు.. బాలయ్య కామెంట్స్ వైరల్!

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో మొదటి సీజన్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే.ఇక రెండవ సీజన్ జులై సెకండ్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Never Have I Ever By Balayya Babu , Balakrishna , Tollywood , Never Have I Ever-TeluguStop.com

ఇప్పటి వరకు షో కి వచ్చిన సెలబ్రిటీలకు ప్రశ్నలు వేసిన బాలయ్య బాబుని తాజాగా ఆహా టీమ్ రాపిడ్ ఫైర్ నిర్వహించింది.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హీరో గా బాలకృష్ణ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ పేరు మీద సోషల్ మీడియాలో కొన్ని వందల మీమ్స్ వైరల్ అవుతుంటాయి.

మరి ముఖ్యంగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్, డాన్స్ ఫై మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఆహా టీం నిర్వహించిన నెవెర్ హావ్ ఐ ఎవర్ షోనీ ప్లాన్ చేసి బాలయ్యకు రాపిడ్ ఫైర్ నిర్వహించారు.

ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు.మీ పై వచ్చే మీమ్స్ విషయంలో మీరు ఎప్పుడైనా నవ్వుకున్నారా? అని ప్రశ్నించగా.అవును నవ్వుకున్నాను అంటూ సమాధానం ఇచ్చారు.

కరోనా సమయంలో లెజెండ్ సినిమాలోని డైలాగ్స్ తో క్రియేట్ చేసిన మీమ్స్ చూసి నవ్వుకున్నాను అని తెలిపారు.

మీరు ఎప్పుడు అయినా కాలేజీకి బంకు కొట్టారా? అని అడగగా.ఎవరైనా బంకు కొట్టకుండా ఉంటారా అని సమాధానమిచ్చారు.

మీకు నేరుగా పబ్లిక్ లోకి వెళ్లి ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఆలోచించకుండా వెళ్ళిపోతారా? అని ప్రశ్నించగా.వెళ్తానని.

అంతే కాకుండా తన మాదిరి పబ్లిక్ తో కలిసే హీరో ఎవరూ లేరు అంటూ సమాధానమిచ్చాడు బాలయ్య బాబు.అంతే కాకుండా తన మనవళ్ళతో తాతయ్య అని పిలిపించుకోవడం ఇష్టం లేదని.

అందుకే బాల అని పిలవమని చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube