కర్ణాటకలో హిజాబ్ వస్త్రధారణ వివాదం తీవ్ర రూపం దాల్చింది.హిజాబ్ కాషాయ వస్త్ర దారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీనితో ఇప్పటికి కర్ణాటకలోని పలు ప్రాంతాలలో కళాశాలల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.ఈ నేపథ్యంలోనే పోటీలు నినాదాలతో రాళ్లు కూడా ఇసురుకున్నారు.
ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు అదే విధంగా ఉపాధ్యాయులు కూడా గాయపడ్డారు.ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇక గొడవలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులపాటు డిగ్రీ కళాశాలకు సెలవులు ప్రకటించింది.
జనవరిలో ఉడిపి ప్రభుత్వ కళాశాలలో ఆరుగురు విద్యార్థులు హిజాబ్ గురించి కళాశాల కు హాజరు కాగా వారిని కళాశాలలోకీ అనుమతించలేదు.కాగా పోటీగా హిందూ విద్యార్థులు కాషాయ కండువ ధరించి వచ్చారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన ఈ వివాదం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.ఇక ఇదే విషయం తాజాగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఒకరి ఒంటరి యువతిపై కొందరు యువకులు దాడికి పాల్పడుతూ దానిని వాళ్లు గర్వంగా ఫీల్ అవుతున్నారు.అది ఒక సిగ్గుమాలిన చర్య.అలాంటి యువకులలో వారి తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు.
వారి పెంపకం సరిగ్గా లేదు.అంతే కాకుండా భవిష్యత్తులో అలాంటి యువకులకు ఉపాధి కూడా దొరకదు.
ఫలితంగా వారి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు.దయచేసి ఇలాంటి వారిపై దయ అస్సలు దయ చూపకండి అంటూ రీచా చద్దా పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదే విషయంపై మరొక బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కూడా సంబంధించింది.
అన్ని విషయాలలో ముక్కుసూటిగా మాట్లాడే సర్వ భాస్కర్ ఈ హిజాబ్ వివాదంపై కామెంట్ చేసింది.జాతి వివక్షత మళ్ళీ వచ్చినట్టు అనిపించింది అంటూ సర్వ భాస్కర్ స్పందించింది.అలాగే ఈ విషయంపై నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఒనిర్ కూడా దీని పై స్పందిస్తూ ఈ విధంగా కామెంట్ చేశాడు.విడిపోతే పడిపోతాం.ఆర్ఎస్ఎస్ గుండాలకు కావాల్సింది ఇదే.మమ్మల్ని వీరు బలహీనపరిచి ఉన్నారు.ఇక దాని నుంచి నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు.ప్రజలారా మేల్కోండి.ఈ వైరస్ లు ఇప్పటికైనా ఆపండి అంటూ దర్శకుడు ఒనిర్ ట్విట్టర్ ఖాతాలో మెసేజ్ ను పోస్ట్ చేశారు.