యూకే: సిక్కు వేర్పాటువాదంపై వ్యాఖ్యలు.. ప్రీతి పటేల్‌కు బాసటగా నిలిచిన సిక్కు నేత

సిక్కు వేర్పాటువాద తీవ్రవాదం ఇటీవలి కాలంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైందంటూ యూకే హోం సెక్రటరీ, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని బ్రిటీష్‌ సిక్కు పీర్ సమర్ధించారు.గతేడాది నవంబర్‌లో వాషింగ్టన్‌లోని హెరిటేజ్ ఫౌండేషన్‌ను ఉద్దేశిస్తూ ప్రీతి పటేల్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 British Sikh Peer Defends Uk Home Secretary Priti Patel's 'sikh Separatist Extre-TeluguStop.com

అందులో డాయిష్, హమాస్‌ల సరసన సిక్కు తీవ్రవాదాన్ని ప్రీతి పటేల్ ప్రస్తావించారు.తద్వారా యూకే, యూఎస్‌లు తీవ్ర భద్రతాపరమైన ముప్పును ఎదుర్కొంటున్నట్లు ఆమె విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో పీర్, బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ ఛైర్మన్ లార్డ్ రామి రేంజర్ స్పందించారు.యూకే హోం సెక్రటరీగా ప్రీతి పటేల్.బ్రిటన్ ఎప్పుడూ ఉగ్రవాదులకు లాంచ్‌ప్యాడ్‌గా మారకుండా చూసుకోవడం సరైనదేనని వ్యాఖ్యానించారు.క్వీన్‌కు ప్రతి ఒక్కరూ విధేయులుగా వుండాలని, దేశానికి ఆస్తిగా మారడానికి కృషి చేయాలని రామి రేంజర్ అన్నారు.

ఏదైనా దేశానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని ఆయన చెప్పారు.కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయత బిల్లుతో అలాంటి వారిని పౌరసత్వాన్ని తొలగించవచ్చని రామి రేంజర్ తెలిపారు.

Telugu Rami Ranger, Sikh Peer, Sikhseparatist, Uksecretary, Tank-Telugu NRI

భారతదేశ ప్రాచీన నాగరికతను కాపాడే యత్నంలో అసాధారణ త్యాగాలు చేసిన సిక్కు గురువుల వలె.భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సిక్కులు వుండాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.మూడు దశాబ్ధాలుగా తోటి కాశ్మీరీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాశ్మీరీ మిలిటెంట్లు ఏం సాధించారో భారత వ్యతిరేకులుగా పనిచేస్తున్న సిక్కులు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.కాశ్మీరీల పురోగతిని అడ్డుకోవడం, తోటి పౌరుల ప్రాణాలు తీయడం, విధ్వంసం తప్ప వారు ఏం సాధించలేదని రేంజర్ గుర్తుచేశారు.

అలాగే 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలతో భారత్‌లోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.గతంలో ఏ ప్రధాని కూడా సిక్కు గురువుల జీవితాలను , వారి బోధనలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయలేదని రామి రేంజర్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube