దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.మూడు వందల యాభై కోట్లకి పైగా వసూళ్లు దక్కించుకున్న పుష్ప సినిమా ను ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ఆహా ఓహో అంటూ అభినందనలు తెలియజేస్తూ ఆకాశాన్ని తాకేలా ఎత్తేస్తున్నారు.
ఈ సమయంలో ప్రముఖ ప్రవచన కర్త అయిన గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.పుష్ప సినిమా పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
ఒక స్మగ్లర్ ను హీరోగా చూపించడం ఏంటీ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.పోలీసులను సవాలు చేస్తూ స్మగ్లింగ్ చేసే వ్యక్తి తగ్గేదే లే డైలాగ్ చెప్పడం విడ్డూరంగా ఉంది అన్నాడు.
తగ్గేదే లే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన ఎద్దేవా చేశాడు.గరికపాటి నరసింహారావు తీవ్ర స్థాయిలో పుష్ప సినిమా ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
ఇలాంటి సినిమాలు ఈ మాత్రం సమాజానికి మంచిది కాదు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇటీవలే పద్మశ్రీ అవార్డును అందుకుని ఎంతో మందితో ప్రశంసలు దక్కించుకున్న గరికపాటి వారు ఇప్పుడు పుష్ప సినిమా వివాదం మొదలు పెట్టి ఇండస్ట్రీ వారితో మరియు సినీ ప్రేమికుల తో కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అల్లు అర్జున్ అభిమానులు గరికపాటి వారికి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.పుష్ప సినిమా గురించి మీరు ఇంతగా బాధ పడుతున్నారు.మరి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏ స్థాయిలో చెడి పోయిందో మీకు కనిపించట్లేదా గురువు గారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు కనిపించడం లేదా అంటూ విమర్శలు చేస్తున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఏ 1, ఏ 2 లుగా ఉన్నారు.అలాంటి వారు పరిపాలనను కొనసాగిస్తున్నారు.
కేసుల్లో ఉన్న వారు అధినేత హోదా లో ఉంటే మీకు ఆ విషయం కనిపించడం లేదు.కానీ వినోదం కోసం తీసిన సినిమా మాత్రం నీకు తప్పుగా అనిపిస్తుందా అంటూ అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ లు ఇస్తున్నారు.
దీనికి గరికపాటి వారి సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.