ఒక‌ప్పుడు ధ‌నిక రాష్ట్రం అన్న కేసీఆర్.. ఇప్పుడు దానం అడుగుడు ఏంది..?

మ‌న‌ది ధ‌నిక రాష్ట్రం.నిధుల‌కు కొద‌వ లేదు.సంక్షేమ ప‌థ‌కాల‌ను నిర్విరామంగా కొన‌సాగుతున్నాయి.అవ‌స‌ర‌మైతే అధిక నిధులు వెచ్చిస్తాం.ఈ మాట‌ల‌ను త‌ర‌చూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తావిస్తుంటారు.స‌భ ఏదైనా, స‌మావేశం ఎక్క‌డ జ‌రిగినా….

 Kcr, Which Was Once A Rich State .now What Is A Donation Step   Kcr, Trs, Ts Pol-TeluguStop.com

ప్రెస్‌మీట్లు పెట్టినా అవ‌కాశం దొరికితే చాలు తెలంగాణ ధ‌నిక‌రాష్ట్రం అంటూ గొప్ప‌ల‌కు పోతాడు.ఇదే స‌మ‌యంలో నూత‌న ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటారు.

హుజురాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యం లోనూ ద‌ళిత‌ బంధు ప్ర‌క‌టించేశాడు.తాజాగా ఓ కీల‌క ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాడు.

ఇందులో దాతల నుంచి విరాళాలు ఆహ్వానించాల‌ని సూచించారు.ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధికి ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు.

రాబోయే మూడేండ్ల‌లో వాటిని స‌మ్ర‌గంగా తీర్చిదిద్దేందుకు ఈ కొత్త ప‌థ‌కాన్ని అమ‌లుజేస్తారు.గ్రామీణ ప్రాంతాల్లో మ‌న ఊరు-మ‌న బ‌డిగా, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మ‌న బ‌స్తీ-మ‌న బ‌డిగా పేర్లు కూడా ఖ‌రారు చేశారు.ప‌థ‌కం అమ‌లుకు రూ.7289.54 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు అనుమ‌తులిస్తూ జీఓ 4ను విద్యాశాఖ కార్య‌ద‌ర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జారీ చేశారు.మొద‌టి విడ‌త 2021-22 విద్యా సంవ‌త్స‌రంలో 9123 పాఠ‌శాల‌ల్లో రూ.3497.62కోట్ల‌తో వ‌స‌తులు కూడా క‌ల్పించ‌నున్నారు.

మండ‌ల యూనిట్‌గా ఎక్కువ‌ మంది ఉన్న పాఠ‌శాల‌ల్లో ప్ర‌ ప్ర‌థ‌మంగా అమ‌లు చేస్తారు. ఎస్ఎంసీ (పాఠ‌శాల యాజ‌మాన్య క‌మిటీ) ఆధ్వ‌ర్యంలోనే ఈ ప‌థ‌కం అమ‌లు జ‌రుగుతుంది.ఇందులో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేస్తారు.పాఠ‌శాల అభివృద్ధికి రూ.10ల‌క్ష‌లు విరాళ‌మిచ్చే దాత‌ల పేర్ల‌ను పాఠ‌శాల‌కు గానీ, త‌ర‌గ‌తిగ‌దికి గానీ పెట్టే అవ‌కాశం క‌ల్పించారు. రూ.2ల‌క్ష‌లు ఇస్తే ఎస్ఎంసీలో స‌భ్యుడిగా చేర్చుకుంటారు.దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా జారీ చేశారు.

పాఠ‌శాల స్థాయిలో చెక్కుల చ‌ల్లింపుల‌న్ని ఎస్ఎంసీ చైర్‌ప‌ర్స‌న్ ప్ర‌ధానోపాధ్యాయుడు , అసిస్టెంట్ ఇంజినీర్‌, స‌ర్పంచ్‌తో క‌మిటీ చేప‌డుతుంది.అన్ని పాఠ‌శాల‌ల్లో పూర్వ‌ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేస్తారు.

వీరంద‌రూ దాత‌ల నుంచి విరాళాలు సేక‌రించేదుకు తోడ్పాటందిస్తారు.అయితే ధ‌నిక రాష్ట్రం తెలంగాణ‌లో గులాబీ బాస్ దానం కోసం ఆదేశాలివ్వ‌డం, క‌మిటీ ఏర్పాటుకు ఓకే చెప్ప‌డం ఆస‌క్తిగా మారింది.

KCR, Which Was Once A Rich State .now What Is A Donation Step KCR, Trs, Ts Poltics, Dalitha Bandu, Bjp Aprty , Ts Congress, Huzurabad - Telugu Bjp Aprty, Dalitha Bandu, Huzurabad, Ts Congress, Ts Poltics

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube