మళ యాళంలో ఓ సినిమా సూపర్ హిట్ అయితే చాలు వెంటనే మన మేకర్స్ ఆ సినిమా మీద ఖర్చీఫ్ వేసేస్తారు.రీమేక్ అని చెప్పి అక్కడ సినిమాలను యాజిటీజ్ దించేస్తారు.
లేటెస్ట్ గా మరో మళయాళ సినిమా మీద తెలుగు మేకర్స్ కన్ను పడ్డది.మోహన్ లాల్, పృధ్వి రాజ్ కలిసి నటించిన బ్రో డాడీ సినిమా ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అయ్యింది.
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన సురేష్ బాబు తెలుగు రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారట.మోహన్ లాల్, పృధ్వి రాజ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ సినిమాని తెలుగులో ముందు వెంకటేష్ రానాతో చేయాలని అనుకున్నారట.
కానీ ఇప్పుడు ఆ సినిమాను వెంకటేష్, నాగ చైతన్యతో చేస్తారని అంటున్నారు.
ఆల్రెడీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి వెంకీమామ సినిమా చేశారు.
ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది.ఇప్పుడు ఆ కాంబో రిపీట్ చేస్తూ బ్రో డాడీ రీమేక్ కూడా వారిద్దరి తోనే చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
బ్రో డాడీ తెలుగు రీమేక్ లో వెంకటేష్ మోహన్ లాల్ పాత్రకి కన్ ఫర్మ్ అవగా పృధ్వి రాజ్ పాత్రలో రానా, నాగ చైతన్య ఇద్దరిలో ఒకరు ఫైనల్ అవ్వాల్సి ఉంది.ఎవరు చేసినా సరే ఈ రీమేక్ దగ్గుబాటి మల్టీస్టారర్ కానుందని చెప్పొచ్చు.