హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజాహెగ్డే ఎప్పటికైనా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించాలనే కోరిక ఉండేది.
అయితే ఈ బుట్టబొమ్మ కోరిక నెరవేరినట్లు తెలుస్తోంది.
నటి పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది అయితే అది వెండితెరపై కాదని ఓ ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ రూపొందిస్తున్న యాడ్ లో భాగంగా పూజా హెగ్డే అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఈ విధంగా తనకు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం రావడంతో పూజాహెగ్డే తెగ సంబరపడిపోతోంది.
ఈ క్రమంలోనే ఈ యాడ్ కు సంబంధించిన వీడియోని పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా మంచి విజయాన్ని అందుకున్న పూజా హెగ్డే ప్రభాస్ తో నటించిన ‘ రాధేశ్యామ్‘ విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రలలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తుంది.
ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.