ఫేస్‌బుక్‌ యూజర్లకు గుడ్ న్యూస్..

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌ త‌న యూజ‌ర్ల‌ను కాపాడుకోవ‌డంతో పాటు కొత్త యూజ‌ర్ల‌ను పెంచుకునే ప‌నిలో ప‌డింది.

టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా భద్రత అత్యావశ్యకంగా మారింది.

అందుకే సోషల్ మీడియా దిగ్గజాలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లు తీసుకువస్తుంటాయి.ఇందులో భాగంగానే మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఓ ఫీచ‌ర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పుడు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.ఇతరుల చాటింగ్ ను స్క్రీన్ షాట్లు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.

తాజాగా, ఫేస్ బుక్ కూడా తన సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ ఫాం మెసెంజర్ లో కొత్త ఫీచర్ తీసుకువస్తోంది.ఈ ఫీచర్ ద్వారా యూజర్ అనుమతి లేకుండా ఇకపై ఎవరూ చాటింగ్ ను స్క్రీన్ షాట్ తీయలేరు.

Advertisement

ఎవరైనా స్క్రీన్ షాట్ తీసేందుకు ప్రయత్నిస్తే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటూ ఓ వార్నింగ్ నోటిఫికేషన్ వస్తుంది.ఇంతకుముందు, వానిష్ మోడ్ లో చాటింగ్ చేసినప్పుడు ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది.

ఇప్పుడు సాధారణ చాటింగ్ లకు కూడా ఈ ఫీచర్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు.దీనితో పాటు.

డిసప్పీయర్ మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు నోటిఫికేషన్ పంపాలనేదే తమ ఉద్దేశ్యం అని మెటా ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌లో ఈ ఫీచ‌ర్‌తో పాటు యూజర్లు మ‌సేజ్‌ల‌కు రిప్లై ఇవ్వానికి లాంగ్ ప్రెస్ అవ‌కాశం తీసుకొచ్చింది.దీంతో పాటు ఫేస్‌బుక్ మెసేంజర్ లో ఫార్వార్డ్ ఆప్షన్ అనే కొత్త ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ తరహా ఫీచర్ ని మనం వాట్సప్, ఇన్స్టాలో చూసాం.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

అంతేకాక.వేరేవాళ్ళ దగ్గర నుండి మనకు వచ్చిన మెసేజ్ లను, ఫొటోలను, వీడియోలను లాంగ్ ప్రెస్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు