టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఏదైనా ఒక కార్యక్రమం లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ సుమారు ఒక్కో కార్యక్రమానికి 4 నుంచి 5 లక్షల వరకు చార్జ్ చేస్తుందని సమాచారం.
ఇలా ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.అయితే తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ సినిమాకి సహా నిర్మాతగా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే వేదికపై శ్రావ్య వర్మ మాట్లాడుతూ సుమ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఒక అమ్మాయి ఎంతో కష్టపడి ఈ సినిమాని చేస్తుందన్న ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు తన సినిమాకి సహాయం చేయాలని భావించారు మెగాస్టార్ చిరంజీవి తన సినిమా రిలీజ్ వేడుక కోసం వస్తానని మాట ఇచ్చారు.
అయితే ఆయనకు కరోనా రావడం వల్ల రాలేకపోయారని ఈ సందర్భంగా శ్రావ్య తెలియజేశారు.
అదే సమయంలో యాంకర్ సుమ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఒక ఈవెంట్ చేయడం కోసం పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకొనే సుమ గారు నా సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా యాంకర్ గా వ్యవహరించారని యాంకర్ సుమ పై పొగడ్తల వర్షం కురిపించారు.ఇక నిర్మాత తన గురించి మాట్లాడుతూ వెళ్లే సమయంలో సుమ మాట్లాడుతూ మరి కాసేపు ఉంటే నా ఆస్తుల వివరాలన్ని చెప్పేలా ఉన్నావు.
ఇక తరువాత సినిమాలు తీస్తారు కదా అన్ని కలిపి అప్పుడు తీసుకుంటా అంటూ తన పై సెటైర్ వేశారు.