రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.కాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి విచిత్రమైన రాజకీయాలే తెర మీదకు వస్తున్నాయి.
టీఆర్ ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఇప్పుడు కేసీఆర్ చాలా రకాల ప్లాన్లు చేస్తున్నారు.అందులో భాగంగా కొందరికి హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.
ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వారికి కచ్చితంగా ఇస్తారనే గ్యారెంటీ లేదు.ఈ నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యే అయిన గొంగిడి సునీతకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ కష్టమే అని తెలుస్తోంది.
ఆమె సీటుకు కేసీఆర్ ఎసరు పెట్టారా అంటు అవుననే సమాధానాలు వచ్చేస్తున్నాయి.ఇప్పటికే కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో సరికొత్త నినాదాలతో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఆయన రాబోయే ఎన్నికల్లో సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ నుంచి కాకుండా… ఇతర నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారంట.ఇక రెండు రోజుల కిందట కేసీఆర్ ఫౌంహౌస్ లో ఇదే విషయమై అత్యంత సన్నిహితులతో మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకున్నారంట.
అంతే కాకుండా ఇక్కడ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డిని నిలబెట్టే ఆలోచనలో కూడా ఉన్నారంట.
ఇక ఆయన సునీత ఎమ్మెల్యేగా ఉన్న ఆలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారంట.ఈ ఆలేరు నియోజకవర్గంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన యాదాద్రి ఆలయం ఉంది.దీని పరిధిలోకే వస్తుండటంతో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారంట.
ఇక తన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడకు వెళ్లడం కూడా చాలా ఈజీ అని భావిస్తున్నారంట.అందుకే ఆ చుట్టు పక్కల గ్రామాలను దత్తత తీసుకున్నట్టు సమాచారం.
ఇక సునీతకు ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు.కానీ ఎంతైనా ఇది సునీతకు మింగుడు పడని అంశమనే చెప్పాలి.