మల్లెమాలపై ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేసిన నాగబాబు.. నెట్టింట్లో ట్రోల్!

మెగా బ్రదర్ నాగబాబు మల్లెమాలకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మల్లెమాల ప్రొడక్షన్ నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా జడ్జిగా ఉన్నటువంటి నాగబాబు కొంతకాలం పాటు జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగారు.

 Nagababu Counters On Mallemala In Comedy Stars Dhamaka , Nagababu, Comedy Stars,-TeluguStop.com

అయితే మల్లెమాలకు నాగబాబుకు మధ్య మనస్పర్థలు రావడంతో నాగబాబు జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత పరోక్షంగా మల్లెమాల సంస్థపై ఎన్నో రకాల విమర్శలు చేశారు.

ముఖ్యంగా మల్లెమాల సంస్థ చేసుకునే అగ్రిమెంట్ గురించి ఆయన పరోక్షంగా ఎన్నో కామెంట్లు చేశారు.

ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న నాగబాబు తిరిగి కామెడీ స్టార్స్ ధమాకా కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా నాగబాబు మరోసారి పరోక్షంగా మల్లెమాల పై సెటైర్లు వేశారు.

ఈ ప్రోమోలో భాగంగా కిరాక్ ఆర్పీ చాలా రోజుల తర్వాత బుల్లి తెరపై కనిపిస్తూ తనదైన శైలిలో కామెడీ పండించారు.

ఈ స్కిట్ లో భాగంగా ఆర్పీ చేసిన అగ్రిమెంట్ స్కిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఆర్పీ తనని ప్రేమిస్తున్నానని ప్రేయసి చెబితే ఆర్పీ అగ్రిమెంట్ రాయిస్తూ సమ్మతి పత్రం మీద సంతకం చేయిస్తాడు.ఈ విధంగా ఆర్పీ అగ్రిమెంట్ పై సంతకం పెట్టమని అడగడంతో వెంటనే నాగబాబు స్పందిస్తూ ఇప్పటికే సంతకాలు పెట్టి పెట్టి చాలామంది వచ్చేశారు… మనకెందుకు ఈ సంతకాలు అంటూ పరోక్షంగా మల్లెమాల పై సెటైర్ వేశారు.

అనంతరం అప్పారావు తన తండ్రిగా నటిస్తూ సంతోషంగా ఉండు నాన్న అని దీవించగా ఆ సమయంలో అవునా అంటూ ఆర్పీ తన తండ్రితో సంతకం చేయిస్తే.వెంటనే నాగ బాబు స్పందిస్తూ ఎవరెవరు ఏ అగ్రిమెంట్లు చూస్తున్నారో.

నా అగ్రిమెంట్ నాకు ఇచ్చేయండ్రోయ్ అంటూ సెటైర్ వేశారు.ఇలా మాటిమాటికి నాగబాబు పరోక్షంగా మల్లెమాల వారి అగ్రిమెంట్ ల పై సెటైర్లు వేయడం చూస్తుంటే వీరి మధ్య జరిగిన గొడవ గురించి మర్చిపోలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube